మాటను
తన నాలుక కత్తితో
కోసి గాయపడి
గేయాన్ని సృష్టించిన
ఒక గొప్ప గాయకుడు అతడు!!
తన గుండెనే
తుపాకి గుండుగా మార్చి
పేల్చేసే
ఒక మందు గుండు సామాగ్రి అతడు!!
ఒక దీపం
మరో దీపాన్ని వెలిగించినట్లు
తన రక్తాన్ని మరొకరికి దానం చేసి
నిరంతరం వెలిగే
ఒక రక్త దీపం అతడు!!!
తన ఒళ్ళును విల్లంబులా వంచి
తన స్వరాన్ని
బాస్వరంలా మండించిన
సామాన్యుల సప్త స్వరాలు అతడు!!!
సమర శంఖం పూరించి
అడవినే జయించిన జనం అతడు
ఒక వరం అతడు!!!
సలసల కాగే రక్తాన్ని త్రాగే
పులులు సింహాలను
భగభగ మండే కొలిమిలో ఆయుధంలా
వేయి శిరస్సులు ఖండించిన
అపూర్వ చింతామణి అతడు!!!
శరీరంతో స్వరాన్ని పొందాడు
ఆయుధంతో ఆత్మను పొందాడు
ఆత్మగౌరవం కోసం జనం కోసం
జీవితాంతం యుద్ధం చేశాడు!!!!!
పెద్ద పెద్ద సముద్రాల మధ్య
పేదల కోసం
సముద్రం ఒడ్డున నిలబడ్డ
ఒక లైట్ హౌస్ గద్దర్!!!!!!!!!!
ఈరోజు గద్దర్ సంస్మరణ సభ కోసం రాసిన కవిత.
Pratapkoutilya lecturer in Bio-Chem palem nagarkurnool dist 🙏
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి