మనకు జ్వరం ఎందుకు వస్తుంది?;- ఎస్.మౌనిక

  హలో!హాయ్ మై డియర్ ఫ్రెండ్స్! ఎలా ఉన్నారు? నేనైతే ఫుల్ హ్యాపీ.....మరి మీరు? ఈరోజు ఇంకో కొత్త విషయంతో  మీ నేస్తం మీ ముందు ఉంది. జ్వరం అంటే ఏంటో మీకు తెలుసా? శరీర ఉష్ణోగ్రత మామూలు కంటే ఎక్కువ కావటాన్ని జ్వరం అంటారు. ఆరోగ్యవంతుని శరీర ఉష్ణోగ్రత 37°C ఉంటుంది. శరీరంలో జరిగే రసాయనిక చర్యల వల్ల పుట్టే వేడి శక్తిని మెదడు చర్మం అదుపులో ఉంచుతాయి. రోగ క్రిములు శరీరానికి సోకితే శరీర కణాలలో పైరోజనులు ఉద్భవిస్తాయి. ఫలితంగా శరీరం యొక్క ఉష్ణోగ్రతను సరిగా ఉంచే కేంద్రాలు పని చేయనందు వల్ల శరీర ఉష్ణోగ్రత పెరగడం ప్రారంభిస్తుంది. ఉష్ణోగ్రతలోని ఈ పెరుగుదలనే మనం జ్వరం అంటాం. జ్వరం అనే శరీర ప్రక్రియ మనలోని రోగ క్రమలను నాశనం చేస్తుంది. జ్వరంలో శరీరంలోని అన్ని అవయవాలు వేగంగా పనిచేస్తాయి. హార్మోనులు, ఎంజైములు రక్త కణాల ఉత్పత్తి తగ్గినంత వృద్ధి పొంది జ్వరకారక క్రిములతో పోరాడుతాయి. జ్వరంలో రక్తప్రసరణ, గాలి పీల్చుకునే వేగం పెరుగుతాయి. జ్వరం చాలాకాలం ఉండటం మంచిది కాదు.జ్వరం వచ్చినప్పుడు శరీరం వేడెక్కి అవయవాలలోని నీటి శాతం తగ్గుతుంది. జ్వరాన్ని నిర్లక్ష్యం చేయడం పెద్ద పొరపాటు. జ్వరం రాగానే వెంటనే వైద్య సహాయం పొందటం ఎంతైనా అవసరం.  మీరు జాగ్రత్త ఫ్రెండ్స్! సరే అయితే..... మనం మళ్లీ ఇంకో కొత్త అంశంతో త్వరలోనే కలుద్దామా? ఉండనా మరి.....బాయ్ ఫ్రెండ్స్👋
కామెంట్‌లు