* లలిత గీతం *;- కోరాడ నరసింహా రావు !
సాకీ :- ఓ మనిషీ... తెలుసుకో నీ గతి... భారతీయమే చూపించు నీకు సద్గతి.... !

పల్లవి :- భక్తి-శ్రద్దలే...భారతీయుల విజయ రహస్యం !
  సదాచారమే  సద్గతికి ప్రధమ సోపానం... !!
       " భక్తీ, శ్రద్దలే......"

చరణం :-
     వేద విద్యతో ప్రపంచానికే 
..గురువై చెప్పినదీభూమి !
 జ్ఞాన, విజ్ఞాన - సిరి, సంపదలతో తుల తూగినదీ ఈ భూమి !!
      'భక్తి, శ్రద్దలే..... "

చరణం :-
      సత్కర్మలతో  - సత్సంగముతో యోగివై నీవు బ్రతకాలి..., 
     తత్ ఫలితముగాఆనందాల భోగివే నువ్  కావాలి... !!...2
      " భక్తీ... శ్రద్దలే......!"
  *********

కామెంట్‌లు