అందమైన బంధం; - కోరాడ నరసింహా రావు
తోడ బుట్టిన... అక్క - తమ్ముళ్లు... అన్న - చెల్లెళ్ళ 
  ఆప్యాయతానురాగాల
    వెల్లడికి..., * రాఖీ * ఓ 
      అందమైన బంధం... !

ఒకరి క్షేమ, సౌఖ్యానందాలను ఒకరు మనసారా... ఇరువురూ కోరుకుంటూ...., భక్తి, శ్రద్దలతో 
ఆ భగవానుని కోరుకొని.... 
కష్ట - సుఖాలలో మనం ఒకరికి ఒకర మున్నాము, అనే భరోసా నిస్తూ.... అన్నదమ్ములకు అక్కాచెల్లెళ్లు.... కట్టే మహిమగల పవిత్ర రక్షా బంధనమే... ఈ రాఖీ పండగ... !

ఇది కేవలము అన్న, చెల్లెళ్ళు  అక్క, తమ్ముళ్లకే కాదు..., 
 భార్య, భర్తకూ కట్టవచ్చు! అన్న,దమ్ములు ఒకరి కొకరు కట్టుకొనవచ్చు... !
ఎవరికెవరు ఈ రక్షాబంధనమును కట్టినా... 
 ఇరువురునూ... ఈ ప్రతిజ్ఞ చేస్తే రక్షాబంధన అర్ధపరమార్ధాలు వెల్లడి అయినట్లే... !
   "నేను నీకు రక్ష...నీవు నాకు రక్ష.... మనము మన కుటుంబాలకు.... మనకుటుంబాలు ఈ దేశానికీ రక్ష " ఈ ప్రతిజ్ఞ తో రక్షాబంధన వేడుక సంపూర్ణమౌను కదా... !!
.   *******


కామెంట్‌లు