భరద్వాజుడు అంటే ‘భరత్ వాజ:’ అంటే ‘వీర్యమును రక్షించుకున్న వాడు’ అర్థం .ఈ అర్థం వెనుక ఒక చిత్రమైన కథ ఉంది. దేవతల గురువైన బృహ స్పతి ఒకసారి తన అన్న భార్య మమతను చూసి కామించాడు. ఆమె ‘ఇది తప్పు కూడద’ని ఎంత వారించినా వినక, బృహస్పతి బలాత్కారంగా తన కోరికను తీర్చు కున్నాడు. మమత గర్భంలో అప్పటికే ఉన్న పిండం, ‘ఇక్కడ ఇద్దరు శిశువులకు స్థానం లేదు’ అంటూ బృహస్పతి వీర్యాన్ని బయటకు వెళ్లగొట్టింది. అప్పుడు ఒక మగపిల్లవాడు జన్మించాడు. ఈ బిడ్డను నీవు భరించమంటే నీవు భరించమంటూ వదినా మరుదులు ఇద్దరూ వాదులాడుకుంటారు. అందువల్లనే ఆ బిడ్డ ‘భరద్వాజుడు’ అయ్యాడు. చివరకు ఇద్దరిలో ఏ ఒక్కరూ ఆ బిడ్డ బాధ్యతను చేపట్టలేదు. అప్పుడు దేవత లైన ఏడుగురు మరుత్తులు భర ద్వాజుడిని తీసుకెళ్లి పెంచుతారు..
మహాభారతంలోని కురుపాండవులకు కులగురువైన ద్రోణుని తండ్రి ఇతడు. రామాయణ కాలంలో వనవాసం చేస్తున్న రామునికి భరద్వాజుడు కొంతకాలం ఆశ్రయమిచ్చాడు.
దివోదాసు అనే క్షత్రియుడికి యుద్ధవిద్యలు నేర్పించిన భరద్వాజుడు ధర్మశాస్త్రాల గురించి గ్రంథం రాశాడు. ఆ గ్రంథానికి భరద్వాజ స్మృతి అని పేరు.
భరతుడు తన అన్నను అయోధ్యకు తిరిగి తీసుకురావడానికి అయోధ్య ప్రముఖులతో, మంత్రులతో, పురజనులతో, చతురంగ బలాలతో అడవికి బయలు దేరతాడు. భరద్వాజ మహర్షి ఇతని భాతృ భక్తి పరీక్షించి, ప్రశంసించి భరతునితో పాటు వచ్చిన అందరికీ తన తపశ్శక్తితో షడ్రసోపోతమైన విందు భోజనాన్ని ఏర్పాటు చేస్తాడు. శ్రీరాముడు వనవాస సందర్భంగా భరద్వజ దంపతులను దర్శించి వారి ఆశీర్వచనాలు తీసుకుంటాడు.
ద్వాజ మహర్షి సప్తఋషులలో (ఏడుగురు ఋషులు) ఒకరు మరియు ధర్మ సూత్రం, శ్రౌత సూత్రం మరియు వ్యాకరణం మరియు ఆయుర్వేదానికి సంబంధించిన గ్రంథాలను రచించారని ప్రతీతి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి