ఆత్రంగా చూసే ధరణికి
ధైర్యమిస్తూ.....
పుడమిపై తరువులకు
ఆహారమిస్తూ....
భువిలో విరిసే అన్నీ
పువ్వులకూ నవ్వులిస్తూ....
అవనిలో అరవిరిసిన
అరవిందాలకు పరిమళమిస్తూ
ధాత్రిపై కల సకల జీవులకూ
చైతన్యమిస్తూ...
ధరిత్రి ప్రసవించు పంట
పైరులకు జీవం పోస్తూ...
పులకరించు పుడమిని
పుత్తడి వెలుగుల నింపేస్తూ...
భూతలానికి తిమిరపు
తెరలు తొలగిస్తూ....
నేలతల్లికి నులివెచ్చని
ప్రేమను పంచి ఇస్తూ....
ఇలకు దిగివచ్చు ఇనుడికి
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి