పిల్లలం పసి మొగ్గలం
అల్లరి చేసే చిరు ప్రాయం
గంతులు వేసే లేగలం
కన్నవారి కంటి పాపలం
పచ్చని ఒడిలో పరుగులు పెడతాం
పువ్వుల్లా నవ్వులు పంచుతాం
మాయా మర్మం తెలియని ప్రేమల విందులం
బంగరు భవితకు బాటలు వేస్తాం
కలిసీ మెలిసిన మైత్రీ భావం
ఐకమత్యమే మా బలం
శక్తీ యుక్తికి చాణుక్యులం
సాహస ధైర్యాలకు వీరశివాజీలం
హిమాలయమంత ఉన్నతం
భరతజాతి ఔన్నత్యం
శతృవులని ఎదిరిస్తాం
త్రివర్ణ పతాకానికి జైకొడతా
శాంతీ సత్యం అహింసయే మా మతం
భరతావనికే ముద్దుబిడ్డలం...
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి