సుప్రభాత కవిత ; - బృంద
గుబులు నిండిన గుండెకు
దిగులు తీర్చే ఉదయం

అలక చెందిన పెదవులకు
నవ్వులు మొలిపించే ఉదయం

అలసిన ఆలోచనలకు అరుదైన 
ఓదార్పు నిచ్చే ఉదయం

నీరసించిన నిట్టూర్పుకు
ఊతమిచ్చి ఊపిరిపోసే ఉదయం

సాగని అడుగులకు కొత్త
బలమిచ్చే ఉదయం

చేరువ కాని దూరాల
చేతికందించు ఉదయం

జవాబు దొరకని ప్రశ్నలకు
నచ్చిన సమాధానం తెచ్చే ఉదయం

మరపురాని గాయాల
మాయచేసి మరపించే ఉదయం

సంకటపరచే సందేహాలకు ఆ
సమస్యే లేదని తెలియచేసే 
ఉదయం

ఎదురయే ఎత్తుపల్లాలను
ఎదుర్కునే ధైర్యమిచ్చే ఉదయం

ఎన్ని కలతలైనా  కాలం ముందు
చిన్నవేనని తెలియచేసే ఉదయం 

ఎదురుచూసే మార్పులన్నిటికీ
ఎరుపెక్కిన తూర్పు తెచ్చే 
ఉదయానికి

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు