కుట్ర కాదు స్వేచ్ఛ!!;- ప్రతాప్ కౌటిళ్యా
దేన్నైనా ఏదైనా ఉపయోగాన్ని బట్టి
అవసరాన్ని బట్టి ప్రకృతి ఎన్నుకుంటుంది!.
పరిణామ క్రమంలో వర్గీకరణలో ప్రాథమిక సూత్రం ఇదే.
అది మొక్కల్లో జంతువుల్లో కూడా!!!?

మొక్కలకు-పనికొచ్చే మొక్కలు పనికిరాని మొక్కలు అని ఉండవు మనకు తప్ప!

జంతువులకు-పనికొచ్చే జంతువులు పనికిరాని జంతువులు అని ఉండవు మనకు తప్ప!!!?

ఆ విషయము మనకు తప్ప వాటికి తెలియదు.!!

సరిగ్గా అట్లే మనుషులు కూడా తమ ఆదిమ అవతారం నుంచి ఇప్పటివరకు మార్పులకు లోనవుతూ వస్తున్నారు పోతున్నారు.!!

ఉపయోగాన్ని బట్టి అవసరాన్ని బట్టి ప్రకృతి వాళ్లని ఎన్నుకుంటుంది.!!

ఇక్కడ మనిషి  - మనిషిని మెదడూ - ఎన్నుకుంటుంది.!!!

ఇక్కడ వెనకబడ్డవారు వెనకబడుతున్నారు
ఎన్నుకోబడ్డవారు ఎన్నుకోబడుతున్నారు.
ఇదంతా సహజంగా జరిగే ఒక మానవ సామాజిక పరిణామం.!!

కాకపోతే వృక్షాలను జంతువులను ప్రకృతి-ఎన్నుకున్నది.!

మనుషులను మాత్రము మనిషి-మెదడు ఎన్నుకుంటున్నది.!!

ఆ తేడా గుర్తిస్తే తప్ప
తెగల నుంచి తరగతుల నుంచి కులాల నుంచి మనం బయటపడలేం.!!!

ఇక్కడ ఎవ్వరి కుట్టలేదు కేవలం
ఒకటి ప్రకృతి ఎన్నిక-రెండు మెదడు ఎన్నిక
బాగా ఆలోచిస్తే అర్థమవుతుంది. అది స్వేచ్ఛ అని.

అందరూ ఆదిలో ఒకరే
అందరూ అందరి కులాలు ఒకటే

కానీ కులాలు ఏర్పడ్డాక

అన్ని కులాలు కలిసి ఏర్పడ్డ గడ్డ
అన్ని కులాలు కలిసిన బిడ్డ
మన తెలుగు గడ్డ మన తెలుగు బిడ్డ!!
ఇదే కులాల స్వేచ్ఛ!!!?

15 th Aug స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని.

Pratapkoutilya lecturer in Bio-Chem palem nagarkurnool dist 🙏
Sri Sri kalavedika district president.

కామెంట్‌లు