సుప్రభాత కవిత ; -బృంద
వడివడిగా విభుని చేర
వరదలొచ్చి ఉరుకుతున్న
వల్లమాలిన అనురాగం
తెల్లవారే నదికెందుకో!?

మేఘమాల పల్లకిలో
మిత్రుడు పంపిన
కనక ఆభరణాలు
సవరించుకోలేదెందుకో?!

చిరుగాలి తరగల్లో
దూరాన సాగేటి
పడవ సరంగు పాట
వినిపించుకోని తొందరెందుకో?!

ఇరువొడ్లు ఒరుసుకుంటూ
దరిచేరు సర్వమూ
తనలోనె కలుపుకుంటూ
వెనుతిరిగి చూడని ఆత్రమేంటో?!

మేఘమాలల చాటున
ప్రేమగా చూస్తున్న రవిని
చూసినా చూడనట్టు
వెడుతున్న కారణమేవిటో?!

సాగరుడి సంగమ తరుణాన
వేగముగా సాగిపోతూ
ఆగని ఉద్వేగ అత్మీయ భావాలు
ఉరకలై పరుగులైనవేమో!!

వెలుగులతో ముగ్గులు వేసే
వైభవమైన వేకువకు

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు