అయుత్తయ (థాయిలాండ్);- తాటి కోల పద్మావతి

 14వ శతాబ్దంలో ఖ్మెర్ చక్రవర్తుల చేత స్థాపించబడిన అయుత్తయ నగరం రామ్ థిబోడి ఒకటి దీన్ని తన రాజధానిగా చేసుకున్న తర్వాత దైవదూతలు పవిత్ర నగరంగా ప్రసిద్ధి చెందింది.
నేటికీ కూడా మధ్యయుగాలనాటి ఆయుత్తయ నగరం యొక్క సౌందర్యం రాజు గురించి మనసులో స్థిర భావాన్ని జ్ఞప్తికి తెస్తుంది. దాదాపు 2 60 ఎత్తయిన అడుగులు గోపురాలతో అద్భుతమైన దేవాలయ
 సముదాయాలతో భారీ బుద్ధ విగ్రహాలు తో అలరారిన ఈ నగరం నుంచి దాదాపు 35 మంది రాజులు 400 సంవత్సరాల పాటు సయామ్ ప్రాంతాన్ని పరిపాలించారు. కాలక్రమంలో ఆగ్నేయ ఆశయాలోనే 10 లక్షల మంది ప్రజలతో అతి పెద్ద నగరంగా సంపన్న నగరంగా రూపుదిద్దుకొంది.
సారవంతమైన నది మైదానాలు అధిక పంట దిగుబడులు చురుగ్గా పనిచేస్తూ పన్నుల వసూలు విధానములు అయుత్తయ అభివృద్ధికి ఉన్నత స్థితికి చేరుకోవడానికి దోహదం చేశాయి. చైనా, జావా, మలేషియా, ఇండియా, సీలోను, జపాన్ పరిషియాలతో వర్తక వాణిజ్యం ఎంతో అభివృద్ధి చెందింది.
17వ శతాబ్ది చివర్లో అయుతయ రాజులు బర్మాతో సైనిక ఘర్షణలకు దిగడంతో అయుత్తయకు కష్టకాలం మొదలైంది.
ఆకాశాన్ని చూస్తున్నట్లుగా ఉన్న మూడు గోపురాలతో ఎంతో అందంగా ఉండేది.
క్రీస్తు శకం 13 50-1767 సంవత్సరాల మధ్య కాలంలో ఐయుత్తయని ఐదు రాజవంశాలు పరిపాలించాయి.
అయితయాకు స్వర్ణయోగంగా చెప్పబడే కాలంలో ఈ నగరంలో మూడు రాజప్రసాదములు 375 దేవాలయాలు 94 నగర ద్వారాలు 29 తోటలతో విలసిల్లింది.

కామెంట్‌లు