భారత ఘన విజయం-ఎడ్ల లక్ష్మి-సిద్దిపేట
వెన్నెలమ్మ నీవు రావమ్మ
మా వేడుకలు చూడమ్మా
నీ చెంతకు మేమొస్తాము
నీ వింతలన్నీ చూస్తాము !!

అందకుండా ఉంటావు
అందరినీ మురిపిస్తావు
నీలో నీడను చూపిస్తావు
నీ నీడ సంగతి చెప్తాము!!

విస్రో వారు పంపారమ్మా
చంద్రయాన్ - 3 వ్యోమనౌక 
భూమి నుండి పైకి వచ్చింది
చిన్నగా నిన్ను చేరింది!!

మెల్లిగా నీపై ఆగింది
రోజు నీతోనే ఉంటుంది
నీ చిత్రాలన్నీ తీస్తుంది
మా భూవి పైకి పంపుతుంది!!

ముందు నడిచే కాలములో
నీ చెంతకు మేం చేరుతాము
అచట మొక్కలెన్నో నాటేసి
చక్కగా ఇండ్లను కట్టేస్తాము!!

చెరువు కుంటలు తవ్వేస్తాం
నీపై పంటలు పండిస్తాము
అచ్చట మేము నివసిస్తూ
నీ గుట్టంతా విప్పేస్తాము !!

మా భారత ఘనవిజయాన్ని
ప్రపంచమంతా చూస్తుంది
మా విస్రో శాస్త్రజ్ఞులకు
మా భారత జనవాహిని వందనాలు!!


కామెంట్‌లు