ఏడు గుర్రాలెక్కి సూరీడు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ భూమినుండి దూరంగా వెళ్ళాలనుకుంటున్నాడు. ఎందుకో తెలుసా? ఒకవైపు అనావృష్టి, మరోవైపు అతివృష్టి. ఒకవైపు తిండిలేక మలమలమాడే ప్రాంతాలు, మరోవైపు మంచుకురిసి ముద్దైపోయే జనావాసాలు. పరిస్థితులు బాగాలేక కొందరు, ఆకతాయి తనంతో మరికొందరు దురాశతో ఇంకొందరు, మదమెక్కిన మరోకొందరు దొంగలై, దోపిడీదారులై, హంతకులై,
అత్యాచారాలు, లైంగికహింసలు చేస్తుంటే సహించలేక విసిగి వేసారిపోతున్న జనాలు తననెక్కడ తిట్టిపోస్తారోనని భయపడుతూ, కారణం తనపై ఎక్కడ నెట్టేస్తారోనని అనుమానపడుతూ, ప్రతి ఇంటిముందూ రంగుల రంగవల్లులతో తనను ఆహ్వానిస్తూనే తానువస్తే ఆ కారణాలకు కారణమైన తనకు బడితేపూజ చేస్తారేమోనని అనుమానిస్తూ ఎదురుచూస్తున్న జనాల మనసును కనిపెట్టి ఏడు గుర్రాలెక్కి సూరీడు వెళ్ళిపోతున్నాడు !!!
+++++++++++++++++++++++++
ఏడు గుర్రాలెక్కిన సూరీడు (చిట్టి వ్యాసం );- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి