శబ్ద సంస్కృతి! అచ్యుతుని రాజ్యశ్రీ
 మధుచంద్ర అంటే హనీమూన్ అని హిందీలో అంటారు.కొత్తగా పెళ్లి ఐన దంపతులు ఏకాంతం లో వేరే ప్రాంతంలో గడపటం.లునా అంటే చంద్రుడు.లునా నించే లునటిక్  అనేపదం వచ్చింది.పాగల్ పిచ్చి అని అర్థం.పౌర్ణమిరోజు అమావాస్య రోజున పిచ్చి ఎక్కువ అవుతుంది.మనసుపై తీవ్రప్రభావం చూపుతాయి చంద్ర కిరణాలు.
మధుపర్కం అంటే తీయని పేయం.తేనె పాలు పెరుగు నెయ్యి చక్కెర తో అభిషేకం చేస్తారు.మత్స్యపురాణం ప్రకారం పూజచేయటం 16 ఉపచారాలలో ఒకటి.తాంత్రిక పూజలో కూడా సమర్పిస్తారు.
మధుప్రాశన్ అంటే నవజాత శిశువుకు తేనె నాకించటం
మదాలస అంటే మదంతో పూర్ణం గా ఉంది.మార్కండేయపురాణప్రకారం విశ్వావసు అనే గంధర్వుడి కూతురు.ఆమెను పాతాళకేతు కిడ్నాప్ చేసి పాతాళంలో దాస్తాడు.ఋతుధ్వజుడు వాడిని చంపి ఆమెను పెళ్ళాడాడు.ఋతుధ్వజుని శత్రువులు అతను చనిపోయాడు అని దుష్ప్రచారం చేశారు.అది విని మదాలస ప్రాణాలు వదిలేస్తుంది.భార్య పోయిన శోకంలో ఉన్న ఋతుధ్వజునిపై జాలితోఅశ్వతరుడు అనే నాగరాజు మదాలస లాంటి అమ్మాయి నా సృష్టించి ఋతుధ్వజునికి అర్పిస్తాడు.ఆమెకు 4గురు కొడుకులు పుట్టారు.మదాలసని సౌందర్యం కి ప్రతీకగా భావిస్తారు.కాళిదాసు కూడా మదాలసాం మంజుల..అని శ్లోకం రాశాడు🌷

కామెంట్‌లు