హాయ్!హలో మై డియర్ ఫ్రెండ్స్! ఎలా ఉన్నారు? నేనైతే ఫుల్ హ్యాపీ... మరి మీరు? విష్ యు ఏ వెరీ హ్యాపీ డే🤝..... ఈరోజు మీ నేస్తం ఇంకో కొత్త అంశంతో మీ ముందుకు వచ్చేసింది గా! జనాభా లెక్కలు ఎందుకో మీకు తెలుసా? అసలు దీనివల్ల ఉపయోగం ఏంటి? ఇది ఎప్పటినుండి మొదలైంది? ఇవన్నీ కూడా ఈరోజు మీ నేస్తం మీతో చర్చించబోతోంది..... పూర్వకాలంలో రాజులు జనాభా లెక్కలు ఎందుకు వేయించేవారంటే పౌరులలో యుద్ధం చేయడానికి ఎంతమంది ఉన్నారు అని తెలుసుకోవడానికి.. పన్నుల వసూల నిమిత్తం కూడా జనాభా లెక్కింపు అనేది జరిగేది. పూర్వకాలంలో బహుశా ఈ రెండు కారణాలవల్లే జనాభా లెక్కింపు అనేది జరిగి ఉండొచ్చేమో..... కానీ ఇప్పుడు జనాభా లెక్కింపు చాలా అవసరం. జనాభా లెక్కల వలన ప్రతి సంవత్సరం ప్రతి వృత్తిలోనూ ఎంత మంది జనాలు ఉన్నారు అనే దాని గురించి ఒక సరైన అవగాహన ప్రభుత్వానికి ఏర్పడుతుంది. దానిని బట్టి విద్య ఆరోగ్యం ఉపాధి మొదలైనటువంటి రంగాలలో ఇతర ప్రణాళికలకు ప్రభుత్వానికి సహాయం లభిస్తుంది. జనాభా లెక్కల వలన దేశ జనసంఖ్య హెచ్చుతగ్గుల శాతం ఎంత అన్నది తెలుస్తుంది. ఈ హెచ్చుతగ్గులను బట్టి ప్రజల అవసరాలకు సరిపడా ప్రణాళికలను ప్రభుత్వం తయారు చేస్తుంది. జనాభా లెక్కింపు వలన గ్రామాల్లో మరియు పట్టణాలలో నివసించే వారి సంఖ్య తెలుస్తుంది. ఇది ఎన్నికలకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ఆయా ప్రాంతాల్లోని జనసంఖ్యను బట్టి ప్రజాప్రతినిధుల సంఖ్య కూడా ఆధారపడి ఉంటుంది. ఇంతే కాకుండా చట్టం అమలు పరచడంలోనూ సామాజిక ఆర్థిక స్థితిని మెరుగుపరచడంలోనూ కూడా జనాభా లెక్కలు ఎంతో ప్రాధాన్యత కలిగి ఉన్నాయి. మనదేశంలో అయితే మొదటిసారిగా 1872లో జనాభా లెక్కింపు జరిగింది. అప్పటినుండి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కింపు జరుగుతూనే ఉంది. 1981 లో కూడా జనాభా లెక్కింపు జరిగింది. కొంచెం కొత్తగా ఉంది కదా ఫ్రెండ్స్! ఇటువంటి ఎన్నో కొత్త విషయాలను మీరు తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే మరెందుకు ఆలస్యం టచ్ లో ఉండండి మొలకతో!.... మనం మళ్లీ ఇంకో కొత్త విషయంతో త్వరలోనే కలుద్దామా?.. ఫ్రెండ్స్! బాయ్ ఫ్రెండ్స్!👋 ఉంటా మరి....
జనాభా లెక్కింపు ఎందుకు?;- ఎస్ మౌనిక

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి