కళ్ళు మూసుకొని నేరుగా ఎందుకు నడవలేము?;- ఎస్. మౌనిక

 హలో!హాయ్ మై డియర్ ఫ్రెండ్స్......ఎలా ఉన్నారు? నేనైతే ఫుల్ హ్యాపీ..... మరి మీరు?విష్ యూ ఏ వెరీ హ్యాపీ డే.... 🤝🤝 ఈరోజు మీ నేస్తం ఇంకో కొత్త అంశంతో మీ ముందు ఉందిగా!.... మీరు ఎవరి కళ్ళకైనా గంటలు కట్టి ఖాళీ ప్రదేశానికి తీసుకెళ్లండి. అక్కడ ఆ వ్యక్తిని ఒక చక్కగా నడవమనండి.  మీకెంతో ఆశ్చర్యం కలిగించేది ఏమిటంటే అతడు ఎంత ప్రయత్నించినా నేరుగా నడవలేడు.కొంతసేపు గుండ్రంగా నడిచి మళ్ళీ బయలుదేరిన చోటుకి చేరుతాడు. అనేకమంది దట్టమైన పొగ మంచులో, చీకట్లో, దారి కనపడక నేరుగా నడవడానికి ప్రయత్నించి బయలుదేరిన చోటుకే వస్తారు.దీన్ని వెనకున్న రహస్యం ఏంటో మీకు తెలుసా? కళ్లకు గంతలు కట్టిన వ్యక్తి నేరుగా నడవలేనందుకు కారణం ఇలా ఉందని చెప్పవచ్చు మన శరీర నిర్మాణంలో కొద్దిగా అసమానత ఉంది. కుడి ఎడమ భాగాల నిర్మాణం సమంగా లేదని దీని అర్థం. ఉదాహరణకు మన గుండె ఎడమవైపు ఉంది. కాలేయం కుడివైపు ఉంది. మన శరీరంలో అస్తిపంజరం కూడా అన్ని వైపుల సమానంగా ఉండదు. కుడివైపు కాళ్లు చేతులు, ఇతర భాగాలు ఎడమవైపు వాటికంటే కొద్దిగా బరువు ఎక్కువ ఉంటాయట.... మన శరీరంలోని ఈ అసమానతల వల్ల కళ్లకు గంతలు ఉన్నప్పుడు నేరుగా నడవలేము. కళ్ళు మూసుకునప్పుడు మన నడక శరీర నిర్మాణం, శరీరంలోని కండరాధీనంలో ఉంటుంది. ఒకవైపు కన్నా రెండోవైపు బరువు అధికంగా ఉండటం వలన ఎక్కువ బరువు ఉన్న వైపు మనలను ఏదో ఒక దిశకి చేరేట్లు చేస్తుంది. ఫలితంగా మనం గుండ్రంగా నడుస్తాము. కళ్ళు తెరిచి ఉంటే మన దేహంలోని అసమానత వలన మనం వెళ్లాల్సిన దారి నుండి అవి మనల్ని తొలగనీయవు. కళ్లకు గంతలు కట్టిన వారిని కారు నడపమంటే వారు 20 సెకండ్లలో తమ దారి నుండి పక్కకు తొలగిపోతారని తెలిసింది. చాలా కొత్తగా ఉంది కదూ ఫ్రెండ్స్!..... నాది కూడా సేమ్ ఫీలింగ్..... ఓకే ఫ్రెండ్స్!మనం మళ్లీ ఇంకొక కొత్త అంశంతో త్వరలో కలుద్దామా.....?ఉండనా మరి....? బాయ్ ఫ్రెండ్స్ 👋
కామెంట్‌లు