అందాల చందమామ (బాల గేయం)- ఎడ్ల లక్ష్మి
అందాల చందమామ
నింగి మీద ఉన్నావా
రంగ రంగ తిరుగుతూ
తొంగి తొంగి చూస్తున్నావా

నీలో నిధులు దాచేసే
బలే బలేగా మురుస్తూ
ఆకాశాన ఆడుతూ
అవని తల్లిని చూస్తావు
 
వసుదమ్మ బిడ్డలు
తెలివి కళ్లదొడ్డలు
నీ పైకి పంపినారు
చంద్రయాన్ 3 వ్యోమ నౌక

అది నీ చుట్టూ తిరుగుతూ
నీ గుట్టంతా విప్పుతూ
కెమెరలో బంధిస్తూ
ఇస్రోకు పంపి ఇంంపుగా చూపిస్తుంది 


కామెంట్‌లు