తిమిరాన్ని హరించే
కాంతిపుంజపు వెలుగులు
వసుధను ఆవరించి
కొత్తజీవం పోయగా....
కన్నీటి కథలన్నిటినీ
కమ్మగా మరపించి
కన్నుల్లో వెన్నెల్లు పూయించు
మత్తుమందు నేదో చల్లగా....
మోయలేని హాయినంత
మోములోనే మెరిసేలా
మురిపించే భావాలను
మరీ మరీ తెలిపేంతగా...
ఆగమించు విభుని
అడుగులను తాకగా
ఆనురాగమంత పూలై
రహదారినంత నింపేస్తూ...
పచ్చికను హత్తుకునే
పసిడికాంతులను
పచ్చని సుమశ్రేణి
పలుకరింప పులకించు పుడమికి
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి