సిసింద్రీలు;- కొప్పరపు తాయారు

  ఆశలరూపమా
=============
1) అలనీలగగ నాన ఓ చందమామ నాడు  అందుకున్నాము నిను చంద్రయానముతోఈనాడు !
 ***************
2) అందరి శ్రమ అందరి ఆశ అందరి కలయిక
     అందరి ఊహల రూపమా ఇస్రో చంద్రయానమా !
 ***************
 3) ముచ్చటగా చేరావు దక్షిణ ధ్రువాన
     మురిపాలు నింపావు అందరి మనసున !
**************
 4) పాత పాటలు మరుగునకు పోయే
      పేరెన్నికగా కొత్త పధాన కొత్త గానమాయే !
****"**********
5) దేశ దేశాల భారత్ పేరు నిలిపినావు
     దేశాభిమానుల గర్వంపు మరకతమైనావు !
**************
6) మా దిగ్విజయానికి రూపమా
     మా ఇస్రో కళా నైపుణ్యమా!
**************
కామెంట్‌లు