గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. (చైనాదేశపు మహా కుడ్యం);- తాటి కోల పద్మావతి

 చైనా దేశపు మహాకుడ్య ము గ్రేట్ వాల్ ఆఫ్ చైనా మానవుల చేత ఇప్పటివరకు నిర్మించబడని అతి గొప్ప నిర్మాణము. అది కొన్ని ప్రత్యేక పరిస్థితులలో అంతరిక్షం నుంచి ఎటువంటి యాంత్రిక సహాయం అవసరం లేకుండా కేవలం కంటితోనే చూడదగినంత అతిపెద్ద కట్టడము.చైనా దేశపు నిగూడా ప్రపంచాన్ని చైనా వారి మాండరిన్ భాషలో'జొంగు'కేంద్ర రాజ్యము అంటారు. భూమి మీద అత్యధిక ప్రజాబాహుల్యము గల ఈ దేశం గురించిన కల్పిత గాధలు, ఇతిహాసము, చరిత్ర అన్ని గలగలసిపోయినాయి.
చైనా ప్రజల సిద్ధి సాఫల్యత వారు చేసిన నిర్మాణాలు వారి మనసును ఆకర్షించే సాంస్కృతిక ప్రగతి కంటే ఎక్కువగా కీర్తి పొందాయి. కళాత్మక అలంకరణలతో కూడిన పింగాణీ పాత్రలు అతి సున్నితమైన చిత్రములు గల పట్టు వస్త్రాలతో పాటు వారి అత్యద్భుత ఆడంబపూరిత మహా సౌథాలు, అన్ని రకాల స్మృతి చిహ్నాలు కూడా పక్క పక్కనే నిలిచి వారి కీర్తికి తోరణాలుగా నిలుస్తాయి. వీటిల్లో భూమిని పంపింపచేసే ఆవిష్కరణలైనా కాగితం తయారు చేయటం, తుపాకీ మందు, చక్రాల తోపుడు బండి, గాలిపటాలతో బాటు చైనా కేంద్రరాజ్యం సాధించిన అద్భుత కార్యంగా చైనా మహా కుడ్యం కూడా ఒకటిగా చేరుతుంది.
క్రీస్తు శకం 446లో కట్టు బానిసలు మూడు లక్షల మంది ఈ గోడ కొత్త భాగాన్ని కొంత నిర్మాణం చేసినట్టుగా తెలుస్తున్నది.
క్రీస్తు శకము 555లో తియాన్ బాక్ చక్రవర్తి ఈ గోడ నిర్మాణానికి 18 లక్షల మందిని వినియోగించాడు. అలాగే 607 సంవత్సరంలో సుయి రాజా వంశం ఈ రక్షకాలను దృఢపరచడానికి 20 లక్షల మంది కూలీలను వినియోగించగా అందులో సగం మంది అంటే 10 లక్షల మంది పనిచేస్తున్నప్పుడే మరణించారు.
దీని మొత్తం పొడవు మీద మహ కుడ్యం రెండు గోడ పొరలుగా ఒక్కొక్క దానికి మధ్య 20 అడుగుల దూరంలో నైపుణ్యంతో చేర్చబడిన ఇటుకరాలతో కట్టబడి ఉంటుంది
గోడ పై పడిన వర్షపు నీటిని తొలగించడానికి మీరు ఉండకపోయే ఏర్పాటు కల్పించబడింది 5 లేక 6 అశ్వికులు లేక పదిమంది కాలిబండ్లు వగల పక్కన ఒకరు నిలబడి ఈ గోడపై కవాతు చేయవచ్చు.
చైనా మహాకుద్యం యునెస్కో వారి చేత 1987లో ప్రపంచ సాంస్కృత వారసత్వ ప్రదేశంగా ప్రకటించబడింది.
క్రీస్తుపూర్వం 220 క్విన్ షీ హయాంగ్ డి పాలనాకాలం 221-210 వరకు వరకు మొదటిసారిగా ఉత్తరం నుంచి సురబాటుదారుల దాడులను అరికట్టడానికి అడ్డుగా కట్టే విధానపు నిర్మాణంతో మొదటగా ఈ గోడలో కొంత కట్టబడింది.
1368 నుంచి 16 44 మింగ్ రాజవంశపు రాజుల చేత ప్రపంచంలోనే అతి భారీ రక్షణ విధానమునకు చెందిన దీని నిర్మాణము చేయబడింది. వయ్యారి అడుగుల 26 అడుగుల ఎత్తుతోను గోపురములు 4 అడుగుల ఎత్తుతోను ఉండును.
గోపురముల సంఖ్య 20,000 నుంచి 25,000 వరకు గోడ వెంట ఉండవచ్చును. ఈ మహాకుద్య నిర్మాణమునకు దాదాపు 200 సంవత్సరముల కాలము పట్టినది.

కామెంట్‌లు