ఆశయ సౌథాలు; పద్మావతి ; పి
చిట్టీ పొట్టీ బాలలం
అమ్మా నాన్నల కంటికి కనురెప్పలం

ఆకాశం హద్దుగా ఎగరాలని
మామతో చందమామతో
ఊసుల కబురులు చెప్పాలని
హరివిల్లుల రంగుల్లా
నీలాకాశంలో విరియాలని
గాలిపటంలా విహరించాలని

ఏవేవో  రెక్కలు తొడిగిన ఊహలు
మదిలో మెదిలే అల్లరి ఆశలు
అందాలని ఎగసే కోర్కెలు
పరుగులు తీస్తూ చిలిపిగా
చిందులు కుందులు 

నవ్వుతు తుళ్ళుతూ
స్వేచ్ఛగా ఎగరాలని
విద్యా వినయం సంపదగా
భావించాలని
జాతికి అంకితం కావాలని
భరతావని వొడిలో
ప్రేమలు

నింపాలని
మా ఊహల రెక్కలు
భావి భవితను తీర్చిదిద్దాలని
ఎన్నెన్నో ఆశల కోర్కెలు..
కామెంట్‌లు