మనకు నిద్ర ఎలా వస్తుంది?;- ఎస్ మౌనిక

  హలో! హాయ్ మై డియర్ ఫ్రెండ్స్....ఎలా ఉన్నారు? నేనైతే ఫుల్ హ్యాపీ.....మరి మీరు?విష్ యూ ఏ వెరీ హ్యాపీ డే🤝🤝 ఈరోజు మీ నేస్తం ఇంకో కొత్త అంశంతో మీ ముందుకు వచ్చేసింది గా!.... జీవించడానికి ఏ విధంగా అయితే గాలి, నీరు, ఆహారం అవసరమో అదేవిధంగా నిద్ర కూడా మనకు అవసరమైనదికదా!పగలంతా కష్టపడి పనిచేసేసరికి మన మెదడు,శరీరం అలసిపోతాయి.అలసి ఉన్న మెదడుకు, శరీరానికి నిద్ర అవసరం. అసలు మనకి నిద్ర ఎలా పడుతుంది? దాని రహస్యం తెలుసుకుంటే చాలా కొత్తగా ఉంటుంది ఫ్రెండ్స్..... శాస్త్రవేత్తల దృష్టిలో మన మెదడులోకంతా ముఖ్యమైన స్థానము నిద్రాకేంద్రం.రక్తంలో కలిసి ఉన్న కాల్షియం ఈ నిద్రా కేంద్రాన్ని అదుపు చేస్తూ ఉంటుందట! సరియైన అంత తూకంలో కాల్షియంను రక్తం ద్వారా నిద్ర కేంద్రం దగ్గరికి పంపినట్టయితే మనకు నిద్ర వస్తుందని శాస్త్రవేత్తలు జంతువు మీద ప్రయోగించి తెలుసుకున్నారు. నిద్రావస్త లో నిద్ర కేంద్రం రెండు పనులు చేస్తుంది. మొదటిది..... అది మెదడును పనిచేయనివ్వదు. దీని వలన మనకి స్పృహ తప్పుతుంది.రెండవది మెదడు నుండి శరీరంలో ఉన్న ఇతర భాగాలకు వేరే నరములను పనిచేయనియదు. దీనివల్ల శరీరం నిద్రావస్తలోనికి వెళ్ళిపోతుంది.ఓ.....ఇది నిజమా? అని అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్..... నేను చెప్పాను కదా కొత్తగా ఉంటుందని!.... మళ్లీ ఇంకో కొత్త విషయంతో త్వరలోనే కలుద్దామా ఫ్రెండ్స్! బాయ్ ఫ్రెండ్స్! మీ నేస్తం మీ ముందు ఉంటుంది త్వరలో!.... 👋
కామెంట్‌లు