సంపదలు గల్గుతఱి మహాజనుల హృదయ
మభినవోత్పల కోమలంబగుచు వెలయు
నాపదలు కల్గునప్పుడు మహా మహీధ
రాశ్మ సంఘాత కర్కశంబయి తనర్చు.
మహాత్ముల మనస్సు సంపదలు సంభవించినప్పుడు కలువ పూవు కంటె కోమలంగా ఉంటుంది. ఆపదలు వచ్చినపుడు పెద్ద కొండలోని రాతి గుండువలె కఠినంగా ఉంటుంది. సంపదలు కల్గినవేళ సజ్జనులు గర్వించి కఠినులుగా నుండరనియు. ఆపదలు వచ్చినప్పుడు వెల వెల బోరని భావము. అలాంటి మానవులు సుజన జీవితాన్ని గడుపుతూ ఆదర్శప్రాయులౌతారు.
జనుల యందు ఎవరిలో అయితే ఎల్లప్పుడూ మంచి లక్షణాలను కలిగి ఉంటారో, వారిని సజ్జనులుగా లోకం కీర్తిస్తూ ఉంటుంది. తమకు ఎటువంటి పరిస్థితి ఉన్నాసరే తమయందు ఉన్న గొప్పగుణముల లక్షణాలను కోల్పోనివారిని సజ్జనులుగా లోకం గుర్తు పెట్టుకుంటుంది.ఇతరుల విషయంలోనూ క్రమశిక్షణతో ఉండేవారిని ఇష్టపడతారు.వీరు తమ తల్లిదండ్రులను గౌరవిస్తారు. చదువులలో సజ్జనులు ప్రధమస్థానంలో ఉండడానికి ఎల్లవేళలా కృషి చేస్తూ ఉంటారు. తమ చుట్టూ ఉన్నవారి ప్రశంసలు పొందుతూ ఉంటారు.
ఎప్పుడూ సజ్జన సాంగత్యం చేస్తూ వుండాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. సజ్జన సాంగత్యం జీవితాన్ని ప్రశాంతమైన మార్గంలో నడిపిస్తుందని అంటున్నాయి. సజ్జనులు మంచి మాటలు చెబుతారు .. మంచి మార్గం చూపిస్తారు. జీవితంలో వేటిని పట్టుకోవాలో .. ఎలాంటి వాటిని విడిచి పెట్టాలో సూచిస్తారు. ఇటువంటి సజ్జన సాంగత్యం ఎంతో గొప్పదని శాస్త్ర వాక్యం. సజ్జనులతో చర్చల్లోని ఆంతర్యాన్ని అర్థం చేసుకుంటూ సారాంశాన్ని సంగ్రహించాలి. ఆ అనుభవంతో మన వ్యక్తిత్వాన్ని మార్చుకోగలగాలి. జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి