కంచి గరుడ సేవ
===============
ఏదైనా ఒక పనిని ఉపయోగం లేకుండా ఎవరూ చేయరు. ప్రయోజనం లేని పనిని చేయటానికి ఎవరు ఇష్టపడరు. కానీ కొన్ని సార్లు ఉపయోగం లేకపోయినా ఎంతో కష్టమైన కొన్ని పనులు చేయవలసి వస్తుంది. గొనుగు కుంటూనో, సనుగు కుంటూనో ఆ పనిని చేస్తాం. ఇలా చేసే పనులనే 'కంచిగరుడ సేవ' అంటారు. కష్టమైన ఇష్టంలేకపోయినా తప్పనిసరై చేసే పనే కంచిగరుడ సేవ. మరి ఈ 'కంచిగరుడ సేవ' నానుడి ఎలా వాడుకలోకి వచ్చిందో చూద్దాం. ఇది ఒక చారిత్రాత్మక పట్టణంలోని ప్రసిద్ధ వైష్ణవ దేవాలయంలో నిత్యం జరిగే ఒక సేవ ఆధారంగా ఉద్భవించింది.
హిందువులు మహా పుణ్య ప్రాంతాలుగా భావించే ఏడు పట్టణాలలో కాంచీపురం ఒకటి. కంచి గా పిలువబడే ఈ నగరం తమిళనాడులో ఉంది. ఇక్కడే కామాక్షి అమ్మవారి శక్తి పీఠం కూడా వుంది. ఇది దేవాలయాల నగరం. వెయ్యికి పైగా దేవాలయాలు ఉన్నాయి. వాటిలో వైష్ణవ దేవాలయాలు అనేకం ఉన్నాయి. ఒక దేవాలయంలో, గుడిముందు పెద్ద గరుడుడి విగ్రహం ఉంటుంది. ఇది ఒక రథం అంత ఉంటుంది. నిత్యం దేవునికి అలంకారాల వంటి సేవలు చేయాలి కదా? గుడి లోపల ఉన్న స్వామి వారికి సేవలు చేయక తప్పదు. మరి గుడి బయట ఉన్న స్వామి వారి వాహనం గరుడుడి కూడా ఈ సేవలు చేయవలసిందేనా? గరుడ విగ్రహానికి సేవలు చేయాల్సిన అవసరం లేదు. చేయటం వలన ప్రయోజనం కూడా లేదు. కానీ చేస్తారు. కారణం భయం. తన వాహనానికి సేవ చేయకుంటే స్వామివారు ఏమనుకుంటారో అని భయం. ఈ భయంతో ఉపయోగం లేకపోయినా రథం అంత ఉన్న గరుత్మంతుని విగ్రహానికి సనుగుతూ సేవ చేస్తూ ఉంటారట. భక్తి లేకుండా చేసే ఈ సేవనే గరుడ సేవ అంటారు. ఈ ఆలయం కంచిలో ఉంది కాబట్టి 'కంచిగరుడ సేవ'గా స్థిరపడింది.
మనకు ఒక ముఖ్యమైన వ్యక్తితో పని పడినప్పుడు ముందు అతని కారు డ్రైవర్నీ ,లేదా బంట్రోతును ప్రసన్నం చేసుకోవటానికి ప్రయత్నిస్తాము. కారు డ్రైవర్ పని చేయలేడని, చేయడని తెలుసు. కానీ ముందు అతనికి ప్రాధాన్యత నిస్తాం. ఇతని వలన మన పని జరగవొచ్చేమో అనే ఆశ లేదా నమ్మకం. పని జరిగేది యజమాని వలనే అయిన ముందుగా వాహన చోదకునికి సేవ చేయటాన్నే *కంచి గరుడ సేవ* గా చెప్పుకుంటాం. ఇష్టం లేకుండా ఉచితంగా సేవ చేయాల్సి వచ్చినప్పుడు ఈ నానుడి వాడుతుంటారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి