నా జెండ వ్యాపించె నభసీమ నలుదెసల
నా జెండ పైకెక్కె నగరాజ శిఖరముల
నా జెండ రంగులే నవ దీప్తులను పరిచె
నా జెండ హంగులే నవ వర్షముల గెలిచె
నా జెండ పగతురకు నరకజిచ్చక్రమౌ
నా జెండ బడుగులకు నాక సంస్థానమౌ
నా జెండ వెదజల్లు నా దేశ కీర్తులను
నా జెండ విలసిల్లు నా యాశయార్తులను
నా జెండ రాజసము నా రుధిర చోదితము
నా జెండ సోయగము నా హృదయ పారగము
నా యాత్మ, నా మనసు,నా కోర్కెలే కూడి
నా జెండలో చేరి నవ్య వర్ణములాయె...
నా జెండ నాకండ, నా జెండ నా కండ
నా జెండ నిండుండె నాగుండెలో నిండ
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి