ఎడ్ల బండి;- ఎడ్ల లక్ష్మి-సిద్దిపేట
మూగల శబ్దం విన్నాను
ముద్దుగా నిద్ర లేచాను

ముంగిట్లోకి వచ్చాను
ఎడ్ల బండి ఆగింది

అమ్మమ్మ తాత దిగారు
కమ్మని పండ్లు తెచ్చారు

అక్కకు నాకు ఇచ్చారు
బొజ్జనిండా తిన్నాము

వెన్నెల వెలుగు వచ్చాక
నులుక మంచం వాల్చాము

ఆచటికి తాత వచ్చాడు
నీతి కథలు చెప్పాడు


కామెంట్‌లు