ఆట వెలదులు;- ఎం. వి. ఉమాదేవి.
వరములీయుతల్లి వరలక్ష్మి దేవిగా
శుభములొసగుచుండు శోభగాను
ధనముధాన్యమివ్వు ధరణిదేవతగాను
శుక్రవారమందు శుభమునీవె!!

చిక్కులెల్లదీర్చు చక్కనైనది దేవి 
భక్తజనుల బ్రోచు శక్తితానె
పసుపుకుంకుమలిడి పచ్చగా దీవించు
నిత్యకళ్యాణిగను నిలుపుమమ్మ!!
కామెంట్‌లు