సుగంధసౌరభాల సుమమాల నా తెలుగు
అనంతకోటి వీణా రాగాల మధురిమ నా తెలుగు
ఆకాశ వీధిలో సాగే అందమైన మేఘమాల నా తెలుగు
రంగు రంగుల హరివిల్లుల చందం నా తెలుగు
కోయిలమ్మ కమ్మని రాగాల పల్లవి నా తెలుగు
పూరివిప్పి నాట్యమాడె నెమలి పింఛం నా తెలుగు
ఆదికవి నన్నయ్య చేతిలో రాగాలు పలికింది నా తెలుగు
తిక్కయ్య కలములో కృష్ణల దూకింది నా తెలుగు
అన్నమయ్య మెడలో హారమై మెరిసింది నా తెలుగు
అందమైన తెలుగు ఆరు ఋతువుల తెలుగు
నక్షత్రాల మెరుపులో మెరిసిపోతుంది నా తెలుగు
చందమామ చల్లదనం కురిపిస్తుంది నా తెలుగు
నల్లమబ్బులోంచి చినుకై కురుస్తుంది నా తెలుగు
చెట్టుకొమ్మల్లోన పుట్టతెనెల్లోన మురిసి మైమరుపిస్తుంది నా తెలుగు
మువ్వన్నెల జెండలా రెప రెప లాడుతుంది నా తెలుగు
గోదారిలా పరుగెడుతుంది నా తెలుగు
కవుల కలాల్లోంచి ముత్యాల్లా జాలువారి పదుగురి ప్రశంసలను అందుకుంటుంది నా తెలుగు
అరవిరిసిన పుష్పమై జాతీయ స్థాయిలో జగముచే కీర్తింప బడుతుంది నా తెలుగు
నను కన్న నా తల్లి నా తెలుగు
నా మదిని దోచి నను మైమరిపింపజేస్తుంది నా తెలుగు
జై తెలుగు భాష
జై జై తెలుగు భాష
అరవిరిసిన పుష్పం- డాక్టర్ చొప్పదండి రాధ- మేడ్చల్
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి