న్యాయాలు -233
వజ్ర లేపన న్యాయము
*******
వజ్రము అంటే వజ్రాయుధము,రవ్వ , ఒక సేనా వ్యూహము, ఉక్కు,అభ్రకము, ఒక గ్రహ యోగము,పిడుగు,కులిశము లాంటి అర్థాలు ఉన్నాయి.
లేపనము అంటే అలుకుట,పూత, భోజనము అనే అర్థాలు ఉన్నాయి.
వజ్రపు పొడితో పూత పూసిన వస్తువు వలె అతి దృఢంగా ఉన్నది అని అర్థము.
వజ్ర లేపనము దేనికి చేయాలి వస్తువుకా? మనసుకా? "వజ్ర లేపన న్యాయము"అని ఓ గొప్ప న్యాయమును మన పెద్దలు ఎందుకు సృష్టించారు? అందులో అంతరార్థం ఏమైనా ఉందా ? అని లోతుగా అధ్యయనం చేస్తే తప్పకుండా ఉందనే సమాధానం వస్తుంది.
వజ్రం అనేది నవరత్నాలలో అత్యంత ఖరీదైనది.సృష్టిలో లభించే అత్యంత కఠినమైన పదార్థాలలో ఇది ఒకటి.దీనికి గల గట్టిదనము,కాంతి పరావర్తన ధర్మము వల్ల నవ రత్నాలలో అత్యంత ఖరీదైన రత్నముగా గుర్తించ బడింది. వజ్రం ఎంత గట్టిది అంటే దాన్ని కోయాలి అంటే మరో వజ్రం కావాల్సిందే.అందుకే"వజ్రాన్ని వజ్రం తోనే కోయాలి" అనే సామెతను వాడుతుంటారు.
గోడ గానీ ఇల్లు గానీ గట్టిగా, దృఢంగా ఉండాలంటే సిమెంటుతో కడతాం. సిమెంట్ పూత పూస్తాం. అలాగే మన మనసు వజ్రంలా దృఢంగా ఉండాలంటే వజ్ర తాపడం చేయాలి.అప్పుడే మనసు దృఢం అవుతుంది.అలాంటి మనసు సంకల్పించిన పని నిరాటంకంగా విజయవంతం అవుతుంది.
ఈ సందర్భంగా వివేకానందుడి మాటలను తప్పకుండా మననం చేసుకోవాలి. నాకు కావలసినవి "ఇనుప కండరాలు,ఉక్కునరాలు,వాని లోపల వజ్రాయుధ సమమయిన మనసు, బలం, పౌరుషం క్షాత్ర వీర్యం, బ్రహ్మ తేజము" అంటారు.
ముందుగా మనం అనుకున్నట్లుగా మనసును వజ్రాయుధ సమము చేస్తేనే సంకల్పానికి బలం పెరుగుతుంది.
వజ్ర సంకల్ప బలంతో విధి రాతను సైతం తిరగ రాయవచ్చని" సావిత్రీ సత్యవంతుల కథ, భక్త మార్కండేయ గాథ"..ఇలా పురాణేతిహాసాల గాథలు చాలా చెబుతున్నాయి.
"అవి చూశామా! విన్నాం కానీ "అని పెదవి విరిచే వారికి అంగాలన్నీ వైకల్యం బారిన పడినా వజ్ర సంకల్ప బలంతో ఎన్నో విజయాలను సాధించిన వ్యక్తులు ఈ భూమ్మీద పుట్టారనడానికి ఇదిగో వీరే నిదర్శనం.
బ్రెయిలీ లిపిని సృష్టించిన అంధుడైన లూయీ బ్రెయిలీ, మూగ చెవిటి గుడ్డితనంతో బాధ పడిన హెలెన్ కెల్లర్, కదలడానికి కూడా సహకరించని అవయవాల వైకల్యాన్ని ఎదిరించి ప్రఖ్యాత ఖగోళ శాస్త్ర వేత్తగా ఖ్యాతి పొందిన స్టీఫెన్ హాకింగ్, బ్రహ్మ చెముడును అధిగమించి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన సంగీత కారుడు బీతోవెన్ , గొప్ప కవులుగా పేరు పొందిన ప్రాచీన కవి హోమర్, తర్వాత కవి జాన్ మిల్టన్ అంధత్వం తాము గొప్ప కవులుగా రాణించడానికి ఎలాంటి అడ్డంకి కాదని నిరూపించారు.
అలాగే మన దేశంలో నాట్య మయూరి సుధా చంద్రన్,స్వర చక్రవర్తి రవీంద్ర జైన్, షూటర్ అవనీ లేఖరా, హాస్య నటుడు నూతన ప్రసాద్, గిరీష్ శర్మ ... ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరెందరో వైకల్యాలను అధిగమించిన ప్రతిభా మూర్తులు మనకు కనిపిస్తారు.వారు అలా తమ ప్రతిభను నిరూపించుకోవడానికి, సృజనాత్మకతను వెలికి తీసుకోవడానికి కారణం మనసుకు చేసిన వజ్ర లేపనము.తద్వారా దృఢమైన వజ్ర సంకల్పం. వాటితో వారి రంగాల్లో అద్భుతమైన ఫలితాలను సాధించారు.
ఇదండీ "వజ్ర లేపన న్యాయము"లోని అంతరార్థం.
సమాజ హితమైన, విధి రాతను మార్చగలిగే వజ్ర సంకల్పం నెరవేరాలంటే నిరంతర సాధన, అకుంఠిత దీక్షతో
కూడిన మానసిక వజ్ర లేపనము అవసరం.అవన్నీ మనలో పాదు చేసుకుని అనుకున్నది సాధిద్దాం.అందరితో 'శభాష్' అనిపించుకుందాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి