శబ్ద సంస్కృతి! అచ్యుతుని రాజ్యశ్రీ
 భ్రమర గీతాలు అంటే భక్తసూరదాస్ రాసిన పదాలు.ఉద్ధవుడు గోపికలమధ్య సంభాషణ.అతను వారి కి గ్నానోపదేశం చేసేటప్పుడు తుమ్మెదలు రొదచేస్తూ తిరుగుతుంటాయి.ఒకతుమ్మెద గోలను భరించలేక దాన్ని సంబోధిస్తూ మనసులో వ్యధను గోపికలు వ్రెళ్ళగక్కుతారు.ఇదే భ్రమర గీతాలు గా హిందీ సాహిత్యంలో ప్రసిద్ధి చెందాయి.
భ్రూణ హత్య అంటే కడుపులో పిండంని ఛిద్రంచేయడం.ధర్మశాస్త్రాల్లో మహాపాపం గా పేర్కొంటారు.జనాభా పెరగటం పెళ్లి కాకుండా గర్భం రావడం తో పొట్టలోని ఆడపాపని చంపడంతో ఆడపిల్లల సంఖ్య తగ్గింది.మగపిల్లలకి వధువులు దొరకటం కష్టంగా మారింది.
మంగళఆచరణం అంటే కావ్యం లేక ఏదైనా రచన ప్రారంభంకి ముందు దైవ గురు ప్రార్థన స్తుతి చేయటం మంగళాచరణం అంటారు.ఏదైనా కార్యం ఆరంభించే ముందు మంత్రం శ్లోకం పద్యం పఠించటాన్ని కూడా మంగళాచరణం అనే అంటారు 🌷

కామెంట్‌లు