విజయం ; - కేశరాజు వేంకట ప్రభాకర్ రావు , పాతర్లపాడు, ఖమ్మం
విజయం  !
అది ప్రతిభకు పరాకాష్ట
పరాజయం!
అది ప్రతిభకు సానపట్టు పాఠం !!

పరాజయం !
ఎద లోలోతుల్లోంచి ఎగిసి పడ్డ కన్నీటి చుక్కలు!!
విజయం !
అణువణువున ఉబికొచ్చే ఆనంద బాష్పాలు !!

పరాజయం !
నేర్పిన పాఠం లోని సారం !!
విజయానికి !
పోసింది నిండు నూరేళ్ళ ప్రాణం !!

ఒక శివుని పరాజయం !
కంట తడి !!
మరో సోమనాథుని !
పంట మడి !!

ఆ పంటను !
స్వార్థం తెలియని హిందూ సనాతన ధర్మం !!
ప్రపంచానికి !
పంచింది లోకా సమస్తా సుఖినోభవంతు అంటూ !!

కామెంట్‌లు