మరుగున పడిన తెలుగు తేజాలు దేశ భక్తులు.. సేకరణ.. అచ్యుతుని రాజ్యశ్రీ

ఆయన ఆకారంలో పొట్టి కానీ గట్టి పట్టున్న కార్యశూరుడు.స్త్రీవిద్య వితంతువివాహాలకై పోరాడారు.సంస్కృతభాషలో దిట్ట.మహాభారతంపై ఆంగ్లంలో రాసిమెప్పు పొందారు.వైజయంతి అనే మాసపత్రిక నడిపారు.కలకత్తా లెజిస్లేటివ్ కౌన్సిల్ లఓ8ఏళ్ళు సభ్యులు గా ఉన్నారు.పిట్టకథలు చమత్కార మాటల్తో అలరించిన ఆయన శ్రీ పినప్పాకం ఆనందాచార్యులుగారు 1843లోచిత్తూరు దగ్గర చిన్న పల్లెలో పుట్టారు.బి.ఎల్.పాసై జడ్జీలకు చెమటలు పట్టించిన చురకలు వేయటంలో దిట్ట.మద్రాస్లో న్యాయవాదులసంఘస్థాపన హిందూ పత్రిక కువ్యాసాలు రాస్తూ1885లోబొంబాయి మొదటి కాంగ్రెస్ సభకు ప్రతినిధిగా హాజరైనారు.ఆయన 1908లో పరమపదించారు.
కొండా వెంకటప్పయ్య గారు 1866లోపుట్టారు.ఉర్దూ ఆంగ్లంలో చదివి నాటకాల్లో ఆడవేషాలువేస్తూ లాయర్ గా మచిలీపట్నం లో స్థిరపడిన ఆయన కృష్ణా పత్రిక నెల కొల్పారు.వితంతు వివాహాలు గ్రామ సమస్యలు పరిష్కారం లో చొరవ చూపారు.1905 లో గుంటూరు జిల్లా ఏర్పడింది.చేతినిండా డబ్బు ! 1942 క్విట్ ఇండియా ఉద్యమం లో76ఏళ్ళ వయసులో పాల్గొన్నారు.ఖాదీ హిందీ ప్రచారంలో ప్రముఖ పాత్ర వహించారు.గుంటూరు శారదా నికేతన్ కితన 150ఎకరాలభూమిని దానం చేశారు.గాంధీజీ ఈయన సలహాలు తీసుకునేవారు.1949 ఆగస్టు 15న అమరులైనారు
కామెంట్‌లు