ఒక శతాబ్దం పైగా ఆమె తన చేతిలోనే కాగడాని పైకెత్తి పట్టుకుని సగర్వంగా తలెత్తుకొని నిలబడి ఉంది. స్వేచ్ఛ విగ్రహం అనబడే స్టాట్యూ ఆఫ్ లిబర్టీ వలస వచ్చే వాళ్లను, కాంది శీకులను కొత్తగా వచ్చే వాళ్లను, సందర్శకులను వేరే దేశం వెళ్లి మళ్లీ తన దేశానికి తిరిగి వస్తున్న అమెరికన్లను ఇలా అందర్నీ న్యూయార్క్ హార్బర్ ముఖద్వారం దగ్గర ఉన్నా ఎంతో ఎత్తయిన"స్టాట్యూ ఆఫ్ లిబర్టీ"సాదరంగా ఆహ్వానిస్తూ ఉంటుంది. క్రీస్తు శకం 18 84వ సంవత్సరంలో ఈ పాదపీఠ నిర్మాణానికి పునాదిరాయి వేయబడింది. ఫ్రెండ్షిప్ ప్రభుత్వం అమెరికన్ ప్రభుత్వానికి కానుకగా సమర్పించింది. పది సంవత్సరాల పాటు ఎంతో శ్రమపడి అపురూపంగా తీర్చిదిద్దింది. 154 అడుగుల ఎత్తు ఉండే ఈ విగ్రహం ఉపరితలం కోసం 2.4 మిల్లీమీటర్లు మందం ఉన్న రాగి రేకును ఎన్నుకున్నారు. 18 84 సంవత్సరం జూలై నెలలో ద్వీపానికి నౌకలో పంపించడానికి వీలుగా బెడ్లోస్ అతని సహాయకులు మొత్తం 350 భాగాన్ని సిద్ధం చేశారు.
ఫ్రెంచి భాషలో నుంచి ఇంగ్లీషులోకి అనువాదం చేస్తే అధికారమైన పేరు ప్రపంచానికి వెలుగును ప్రసాదించే స్వేచ్ఛ, స్వేచ్ఛ విగ్రహం, స్వేచ్ఛ వనిత, స్వేచ్ఛ కుమారి అని కూడా పిలువబడుతుంది. దీని మొత్తం బరువు 254 టన్నులు ఉంటుంది. 151 అడుగులు ఎత్తైన ఈ విగ్రహం 254 అడుగుల ఎత్తైన పాదపీఠం మీద నిలచి ఉంటుంది. పై భాగానికి చేరడానికి వీలుగా 192 మెట్లు నిర్మించబడ్డాయి. విగ్రహం కిరీటం దగ్గరకు చేరటానికి ఇంకొక 354 మెట్లు అమర్చబడ్డాయి. క్రీస్తు శకం 1984వ సంవత్సరంలో యునెస్కో ఈ విగ్రహాన్ని ప్రపంచ సాంస్కృతిక వారసత్వ ప్రదేశాల జాబితాలో చేరింది.
స్వేచ్ఛ విగ్రహం (యూఎస్ఏ);- తాటి కోల పద్మావతి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి