వికారాబాద్ జిల్లా తాండూర్ తెలంగాణ గురుకుల బాలికల పాఠశాలలో చదివిఎస్ఎస్సి లో జిపిఏ 10/10 సాధించిన
కావలి నవ్య తో మొలక చిట్ చాట్
======================================================================
మొలక ప్రతినిధి.; హాయ్ నవ్య కీర్తిబాగున్నావా ఫస్ట్ అఫ్ ఆల్ కంగ్రాట్యులేషన్
కావలి నవ్య కీర్తి;-థాంక్యూ సో మచ్ సర్ఐ యాం ఫైన్
మొలక ప్రతినిధి,; వికారాబాద్ జిల్లాలోని తెలంగాణ గురుకుల తాండూరు పాఠశాలలో ఐదవ తరగతి నుండి పదవ తరగతి వరకు చదివి ఎస్ఎస్సి లో స్కూల్ టాపర్ తో పాటు జిల్లాలో తెలంగాణ గురుకుల రెసిడెన్షియల్ సొసైటీలో 10/10 GPA సాధించి టాపరుగా నిలిచావు అభినందనీయం ఎలా చదివావు
కావలి నవ్యకీర్తి.;- చాలా సంతోషంగా ఉంది. సార్మా నాన్న గురుకులంలో ఐదవ తరగతి తాండూర్ TSRS లో చేర్పించి SCC వరకు చదివించారు మా అమ్మ నాన్నలకు నేను ఎంతో రుణపడి ఉన్నాను.మా నాన్న పదవ తరగతి ఫెయిల్ అయ్యి కూడా మమ్ములని గురుకులంలో చదివించినందుకు ఐ యాం సో లక్కీతాండూరు తెలంగాణ గురుకుల పాఠశాల ఐదో తరగతి నుండి పదోతరగతి వరకు చదవడం తో జీవితానికి కావలసిన చదువుతోపాటు సంస్కారం, క్రమశిక్షణ ఆటుపోట్లను ఎలా ఎదుర్కోవాలని నేర్పించింది. ఉపాధ్యాయుల సపోర్ట్ చాలా ఉంది.
మొలక ప్రతినిధి. ;-ఒకటో తరగతి నుండి నాలుగో తరగతి వరకు ఎక్కడ చదివావు
కావలి నవ్య కీర్తి,;-మాది రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ దగ్గర కొందుర్గు మండలం ఆగిర్యలగ్రామంమా అమ్మానాన్నల పేరు సత్యం కవిత
నాకు ఒక తమ్ముడు ఉన్నాడు సాయి శ్రావణ్ఒకటో తరగతి నుండి మూడవ తరగతి వరకు నేతాజీ మోడల్ స్కూల్ షాద్నగర్ లో చదివాను
నాలుగవ తరగతి ప్రాథమిక పాఠశాల ఆగిర్యాల పూర్తి చేసుకున్నాను
మొలక ప్రతినిధి ,;-మీ తమ్ముడు ఏం చదువుతున్నాడు
కావలి నవ్య కీర్తి ;- నాకు ఏకైక తమ్ముడు సాయి శ్రావణ్ TSWREIS లో కోందుర్గు లో ఆరో తరగతి చదువుతున్నాడు.
మొలక ప్రతినిధి,ప్రస్తుతం ఇంటర్ ఎక్కడ చదువుతున్నావు
కావలి నవ్య కీర్తి;-ప్రస్తుతం వికారాబాద్ జిల్లా కేంద్రంలో సంఘం లక్ష్మీ బాయి గురుకుల బాలికల జూనియర్ కళాశాలలో సీటొచ్చింది.
ఎంపీసీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను ఈ కాలేజీలో ప్రిన్సిపల్ రమణమ్మ మేడం ఉపాధ్యాయుల సహకారం చాలా బాగుంది.
మొలక ప్రతినిధి,;-ఇంటర్ తర్వాత ఏం చేయాలనుకున్నావు,
కావలి నవ కీర్తి;-ఇంటర్ తర్వాత ఐఐటి సాధించిబిజినెస్ పై అవగాహన పెంచుకొని భవిష్యత్తులో పదిమందికి ఉద్యోగాలు ఇచ్చే బిజినెస్ ఉమెన్ గా స్థిరపడాలనిఆశ ఉంది.
మొలక ప్రతినిధి,;మీ అమ్మ నాన్నలు ఏం చేస్తుంటారు
కావలి నవ్య కీర్తి,;-అమ్మానాన్నలు ఊర్లోనే ఉంటూ వ్యవసాయ పనులు చేసుకుంటున్నారునాన్న పదవ తరగతి ఫెయిల్ అయ్యాడని హేళన చేయడంతో మనసులో పెట్టుకొని నాన్న మమ్మల్ని ఉన్నత చదువులు చదివించాలని సంకల్పంతో ప్రభుత్వ సహకారంతో గురుకుల లో చదువుకుంటున్నాను.
మొలక ప్రతినిధి,;-నీకు రోల్ మోడల్ ఎవరు
కావలి నవ్య కీర్తి,;-మా నాన్న నే ఇన్స్పిరేషన్టీచర్ల సపోర్ట్ ఎప్పుడు మర్చిపోలేను.
మొలక ప్రతినిధి.;-నీకు ఎలాంటి =అభిరుచులు ఉన్నాయి
కావలి నవ్య కీర్తి; కథలో రాయడం ఇంట్రెస్ట్ ఉందికానీ సమయం లేకపోవడంతో రాయలేకపోతున్నాను. భవిష్యత్తులో మంచి కథలు రాస్తాను.
మొలక ప్రతినిధి;-చివరగా భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నావు,
కావలి నవ్య కీర్తి,;భవిష్యత్తులో ఐఐటి సాధించి పదిమందికి ఉపాధి కల్పించే విధంగా బిజినెస్ ఉమెన్ గా ఎదగాలనిఉంది కష్టపడి చదువుతానాన్ని అందరూ సపోర్ట్ చేస్తున్నారన్నారు.
మొలక ప్రతినిధి;-భవిష్యత్తులో నీ కల సాకారం కావాలని అమ్మానాన్నలకు స్కూలుకు మంచి పేరు తీసుకురావాలని
మొలక ఆశిస్తూ అభినందిస్తున్నాం
;-కావలి నవ్య కీర్తి;-థాంక్యూ వెరీ మచ్ సర్మీలాంటి వారి సపోర్ట్ కావాలనికచ్చితంగా ఉపాధ్యాయుల సహకారంభగవంతుని ఆశీస్సులతో భవిష్యత్తులో మొక్క వలె ఎదుగుతాను.
మొలక ప్రతినిధివిష్ యు ఆల్ ద బెస్ట్కావలి నవ్య కీర్తి
*************************************************************************
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి