సభా ప్రాంగణం అంతా కోలాహలంగా ఉంది మళ్లీ అనే 22 సంవత్సరాల యువతి అక్కడికి టయోటా కారులో వచ్చి దిగింది.మల్లికి స్టేజ్ పైన గోడకు పెద్దగా నిలవెత్తు ఫ్లెక్సీ మేడం సుజాత గారిది ..చూస్తూనే కళ్ళు చెమ్మగిల్లాయి .
ఎర్రటి తివాచీపై మెల్లగా నడుచుకుంటూ స్టేజి పైకి ఎక్కింది అందరిని పరికించి చూసింది. అందరూ మల్లి సుజాత కోసం ఏమి చెబుతుందో అని ఉత్కంఠతతో ఎదురుచూస్తున్నారు.
నిలువెత్తు ఫ్లెక్సీని అలా చూస్తున్నా మల్లి ఆలోచనలు గతంలోకి పరుగులు తీసాయి.
6 ఏళ్ల వయసప్పుడు మళ్లీ కోయగూడెం నుండి ఆహార సంపాదనకై పల్లెకు వచ్చిన అనాధ. ఆహారం కోసం బస్ స్టేషన్ లో అడుక్కుంటున్న మల్లిని చేరబిలిచి అనాధాశ్రమంలోకి తీసుకొచ్చింది సుజాత. ఆ రోజు నుండి తన అలనా పాలనా చూస్తూ చదువు చెప్పి నేడు ఒక వైద్యాధికారిగా వృత్తిని చేపట్టేలా చేసిన మహా వ్యక్తి. ఎప్పుడు చిరునవ్వు ఆభరణంగా గల అమ్మ అలసట అనేది ఎరుగదు.తనలాంటి ఎంతోమంది అనాధలను చేరదీసి అన్నీ తానై తల్లిదండ్రులు లేని లోటును తెలియనివ్వకుండా పెంచింది. సుజాతను అందరూ అమ్మ అని పిలిచేవారు. సుజాతకు పిల్లలు లేరు. భర్త సైనికుడు పాకిస్తాన్ కాల్పుల్లో వీర మరణం చెందిన వీరుని భార్య. భర్త జ్ఞాపకాలను ప్రోదిచేసిన ఒక పెంకుటిల్లు ఆరు మామిడి చెట్లు కలిగిన ఆవరణంలో ఉంటూ ప్రభుత్వం అందించే పెన్షన్ తో తనలాంటి ఎంతోమందికి విద్యను అందించింది. తను కొవ్వొత్తిలా కరుగుతూ ఇతరుల జీవితాల్లో వెలుగును నింపిన సాధ్విమణి ఇలా హఠాత్తుగా కానరాని లోకానికి వెళ్లడం మల్లి మాత్రమే కాదు అక్కడున్న వారు ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఇప్పుడు అందరి మెదుడుల్లో తొలుస్తున్న ఏకైక ప్రశ్న అనాధాశ్రమం నిర్వహించబడుతుందా? లేక మూసివేస్తారా? మూసివేస్తే అక్కడ ఉన్న అనాధల పరిస్థితి ఏమిటి?
మల్లి కంట్లో నుండి రెండు కన్నీటిబొట్లు నేలరాలాయి. తదేకంగా మల్లి నే చూస్తూ..ఉన్న సభ నిర్వాహకులు మల్లి గారు మాట్లాడండి అన్న మాటతో ఇహంలోకి వచ్చిన ఆమె దృఢనిశ్చయానికి వచ్చినదై..
సభకు నమస్కారం ఈనాడు నేను ఈ స్థాయిలో మీ ముందు నిలబడడానికి కారణం అమ్మ ఆశయం చాలా గొప్పది తన జీవితాన్ని నాలాంటి అనాధల చదువు కొరకు అంకితం ఇచ్చింది ఎందరో అనాధలకు అమ్మగా వారి బ్రతుకులను మలిచింది. అన్నదానం కన్నా విద్యాదానం గొప్పది. వెలుగుతున్న కొవ్వొత్తే మరిన్ని కొవ్వొత్తులను వెలిగించ గలదు. అమ్మ ఆశయం వమ్ము కానివ్వను ఈ ఆశ్రమం బాధ్యతలు నేను తీసుకుంటున్నాను.అనడంతో చప్పట్లతో తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అమ్మ చిరునవ్వు తో మల్లిని దీవించిన చల్లని చేతిస్పర్శ కలిగిన భావన కలిగింది మల్లికి.
✍🏻 లతాశ్రీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి