వెన్నయినా... మన్నైనా...ప్రియమారగ తినగలవు !జట్టుగాళ్లతో కూడి....మీగడ పాలను, వెన్నముద్దలు దొంగిలించగలవుఆలమందలతో... అడవులకేగి..... గోప బాలురతో చద్దిబువ్వలను. కలిసి తినగలవు !అమ్మకు నోటను బ్రహ్మాoడంబునేచూ పించనూ గలవు !కొనగోటితో ఆ గోవర్ధనమును ఎట్టి నిలుప గలవు !మడుగున ఆ కాళీయుని....శిరములపై... తకధిమి యంటూ తాండవమాడెదవుచంపవచ్చిన రక్కసులందరి పీచమణచ గలవు... !సయ్యాటలాడ గలవు....తుంటరి కృష్ణా... !నీ బాల క్రీడలతో.... మముమై మరపించెదవు !!ఓ బాలకృష్ణా... జేజేలు !మధురాధిపతీ జేజేలు !!. *****
హే కృష్ణా- కోరాడ నరసింహా రావు !
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి