ఇటీవలే అమెరికాకు చెందిన గ్లోబల్ ఆవియేషన్ ఫౌండేషన్ సంస్థ విడుదల చేసిన అధ్యయన నివేదికలో ప్రపంచ వ్యాప్తం గా అత్యధికంగా మహిళా పైలెట్లు భారత దేశం లోనే వున్నారన్న గణాంకాలు మన దేశO లో మహిళల సుస్థిర అభివృద్ధికి,మహిళా సాధికారతకు ప్రత్యక్ష నిదర్శనం.సదరు నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తం గా లక్షా ముప్ఫై వేల మంది కమర్షియల్ ఎయిర్ పైలెట్లు వుండగా వారిలో మూడు సాతం అంతే సుమారుగా నాలుగు వేల మంది మాత్రమే మహిళా పైలెట్లు వున్నారు. అయితే వీరిలో 525 మంది పైలెట్లు ( 13 శాతం) భారతీయులే కావడం విశేషం.అమెరికా, ఆస్టృఏలియా, రష్యా తర్వాత స్థానాలలో వున్నాయి.గో ఎయిర్- ఇండిగో సంయుక్తం సంస్థలో అత్యధికం గా 155 మంది పనిచెస్తున్నారు. కాగా ప్రస్తుతం దేశ వ్యాప్తం గా 155 మంది మహిళలు వివిధ పైలెట్ శిక్షణా సంస్థలలో శిక్షణ పొందుతునట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి.
భారత దేశO లో మహిళలు పైలెట్ రంగాన్ని ఎంచుకొని అందులో ప్రపంచ ఖ్యాతి వహించడానికి స్పూర్తి సరళా ఠక్రల్ అని చెప్పవచ్చు.ఈమె భారతదేశ పు తొలి మహిళా పైలెట్ గా గుర్తింపు పొందింది.1914 వ సంవత్సరం లో ముంబాయి లో జన్మించిన ఆమెకు చిన్ననాటి నుండి సాహసకృత్యాలు అంటే ఎంతో మక్కువ. మహిళల పట్ల వివక్షత, ఆంక్షలు బాగే ఎక్కువగా వున్న నాటి కాలం లో తన 18 వ ఏట తల్లిదండ్రుల ప్రోత్సాహం తో ముంబయి లోని పైలెట్ శిక్షనా సంస్థలో చెరి అందులో అద్వితీయ ప్రతిభ కనబరచి 1936 లో అంతే తన 21 వ ఎట ఏవియేషన్ పైలెట్ లైసెన్స్ సంపాదించింది. అనంతరం లాహోర్ ఫ్లయింగ్ క్లబ్ లో చేరి అచిరకాలం లోనే వెయ్యి ఫ్లయింగ్ గంటలు పూర్తి చేసుకున్న తొలి మహిళగా, భారతీయురాలిగా రికార్డు సాధించింది. 16 వ ఏటనే వివాహం అయ్యిన కారణం గా ఆమెకు ఒక పాప కూడా వుంది. భారత విమాన దళం లో పని చేస్తున్న ఆమె భర్త అయిన కెప్టెన్ శర్మ కుడా ఆమెకు అధ్భుతమైన పోత్సాహం, సహకారం అందించారు. వీరిద్దరూ కలిసి కొన్ని అరుదైన రికార్ఢులు సాధించారు. శర్మ అతి అరుదైన ఏయిర్ మెయిల్ పైలెట్ లైసెన్సును , సరళ ఏ గ్రేడ్ లైసెన్సు ను సాధించిన తొలి భారతీయులు. భార్యా భర్తలిద్దరూ కలిసి వెయ్యి గంటలు సంయుక్తం గా విమానాలను నడిపారు. ఆ కాలం లో భార్యాభర్తలిద్దరూ పైలెట్లు కావడం భారత విమానయాన చరిత్రలోనే ప్రధమం. బ్రిటీషు ప్రభుత్వం ఇంగ్లండు లో నిర్వహించిన పోటీలో సరళ తృతీయ స్థానం లో నిలబడి ప్రపంచ దృష్టి ఆకర్షించింది.సజావుగా సాగుతున్న వారి జీవితం లో అనుకోని దుర్ఘటన సరళ జీవితాన్ని చెల్లాచెదురు చేసింది. 1939 లో విమాన ప్రమాదం లో ఆమె భర్త కెప్టెన్ శర్మ మరణించడంతో ఆమెను ఆ వృత్తి వదిలివేయాలని అత్తమామలు, తల్లిదండ్రులు, బంధువర్గం శాసించారు కాని అంత విషాదంలోను సరళ వారిని ధైర్యం గా ఎదిరించి తన వృత్తి కొనసాగించింది.అయితే రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటీషు ప్రభుత్వం యుద్ధం లో పాల్గొనడానికి నిరాకరించిన కారణంగా ఆమె పై అన్ని రకాల ఒత్తిళ్ళు తీసుకువచ్చిం. కమర్షియల్ పైలెట్ లైసెన్సు పరీక్షలో ప్రధమ స్థానం లో ఉత్తీర్ణత సాధించినా చిన్న చిన్న కారణాలతో లైసెన్సును ఇవ్వడానికి నిరాకరించింది. . దానికి తోడు ఇద్దరు అమ్మాయిల కారణం గా కుటుంబ బాధ్యతలు పెరగడం వలన, సమాజం నుండి ఎదురౌతున్న అవహేళన, అవమానాలు,ప్రభుత్వ ఒత్తిళ్ళ కారణం గా సరళ తన కిష్టమైన వృత్తిని వదులుకొని లాహోర్ లో స్థిరపడింది.అక్కడ మాయో స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ లో అధ్యాపకురాలిగా చేరి తన కిష్తమైన పెయింటింగ్, చిత్ర లేఖనం లో విధ్యార్ధులకు చక్కని శిక్షణ ఇవ్వదం ప్రారంభించింది. అక్కడ ఆర్య సమాజ్ లో సభ్యు రాలిగా చేరి నిరంతరం సమాజ సేవ చేస్తుందేది. 1948 లో తన తొటి ఆర్య సమాజ సభ్యుడైన ఆర్ పి ఠక్రల్ ను వివాహమాడి ముంబయిలో స్థిరపడింది. నాటి కాలం లోనే , క్రమశిక్షణ, మొక్కవోని ధైర్య సాహసాలతో, వృత్తి పట్ల అంకిత భావం , స్వయం శక్తితో అనేక రికార్డులను తిరగరాసి ప్రపంచ వ్యాప్తం గా గుర్తింపు పొందడమే కాకుండా భారత దేశ కీర్తి పతాకాలను ప్రపంచం నలుమూలలా ఎగురవేసిన సరళ ఠక్రల్ 2008 మార్చి 15 న తుడి శ్వాస విడిచింది. ఆమె జీవితం యావత్ భారత మహిళా లోకానికే స్పూర్తిదాయకం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి