ఓ రోజు పొద్దున్నే ఒక మెసేజ్ వచ్చింది,అది కరీం నగర్ -సీనియర్ డాక్టర్, రాష్ట్ర ఐఎంఏ ప్రెసిడెంట్ బి.ఎన్.రావు
సార్ దగ్గరి నుంచి, సాయంత్రం ఐదు గంటలకు నేను బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నాను, నువ్వు రావాలని.డాక్టర్ బి.ఎన్.రావు గారు నాకు గత పదిహేళ్ళ నుంచి పరిచయం.ఆయన కరీంనగర్ లో రుమటాలజిస్ట్.అంతే కాకుండా సీనియర్ డాక్టర్.ఆయనంటే స్థానికంగా చాలా మంది డాక్టర్లకు అమితమైన ఇష్టం.పెద్దాయన చిన్నా పెద్దా తేడా లేకుండా అందరితో కలివిడిగా ఉంటారు.ఆయనలో ఇంకో కోణం కూడా ఉంది,అది ఆయన మంచి కవి, రచయిత, వ్యాసకర్త,అనువాదకులు.అప్పట్లో నాలోని పుస్తక పఠన అభిరుచిని గమనించి ఆయన తన ఇంట్లోఉన్న పెద్ద లైబ్రరీని చూపించారు.గొప్ప గొప్ప సాహితీ వేత్తల వందల పుస్తకాలు ఉన్నాయి అందులో.ఇక అప్పటి నుంచి నేను ఎప్పుడు కరీం నగర్ కు వెళ్లినాఆయనను తప్పకుండా కలిసే వాడిని.ఆయనతో సాహితీ చర్చలు చేస్తున్నప్పుడు, ఇంకా ఏదో మిగిలి పోయిందని ఫీల్ అయ్యేవాడిని.అలాచాలా సార్లు మా మధ్య జరిగిన సంభాషణలు అనేకం ఉన్నాయి.ఒక సంవత్సరన్నర క్రితం ఆయన రాష్ట్ర ఐఎంఏ ప్రెసిడెంట్గా ఎంపికయ్యారు.ఇప్పటికీ పదవిలో కొనసాగుతూనే ఉన్నారు.అపారమైన విషయ పరిజ్ఞానం.తెలుసుకోవాలన్న ఆసక్తి ఆయనలో ఎక్కువగా కనిపిస్తుంది.ఆయన తెలుగు నుంచి ఆంగ్లంలోకి చేసే అనువాదాలు ప్రోజ్ కానీ, పోయెట్రీ కానీ చాలా అద్భుతంగా ఉంటాయి....కట్ చేస్తే... శుక్రవారం సాయంత్రం ఐదు గంటలు.బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తిలక్ నగర్ హాస్పిటల్
ఓనర్ డాక్టర్ కిషన్ రావు,మహబూబ్ నగర్ జిల్లా ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ రామ్మోహన్ గార్లతో సహా కరీంనగర్ నుంచి వచ్చిన అనేక మంది ప్రాక్టీసింగ్ డాక్టర్లు బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకోవడానికి హాజరైయ్యారు.కరీంనగర్ ఐఎంఏ ప్రెసిడెంట్ రాంకిరణ్ సీనియర్ డాక్టర్ కిషన్,ఫిజీషియన్ డాక్టర్ వెంకటేశ్వర్లు, ఇంకా ఎక్కువగా కరీంనగర్ టౌనులో ప్రాక్టీస్ చేసే డాక్టర్లతో హాలు కళ కళలాడింది.డాక్టర్ బి.ఎన్.రావుఆధ్వర్యంలో తెలంగాణాలోనీ, వివిధ జిల్లాల ఐఎంఏ అధ్యక్షులతో సహా దాదాపుగా వంద మంది డాక్టర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రి హరీశ్ రావు,కరీంనగర్ మంత్రి గంగుల కమలాకర్, మాజీ ఎంపీ వినోద్, తదితరులు వేదికపై ఆసీనులైయ్యారు.
మొదట మంత్రి హరీష్ రావు, డాక్టర్ బి.ఎన్.రావు కుగులాబి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఆ తరువాత మిగితా డాక్టర్లు కూడా గులాబీ కండువా కప్పుకుని పార్టీలో చేరారు.డాక్టర్ బి.ఎన్.రావు, మంత్రిహరీశ్ రావులు మాట్లాడాక కార్యక్రమం ముగిసింది.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి