నిద్రలో మన శరీరంలో ఏం జరుగుతుంది?;- ఎస్ మౌనిక

 హలో! హాయ్ మై డియర్ ఫ్రెండ్స్..... ఎలా ఉన్నారు? నేనైతే ఫుల్ హ్యాపీ..... మరి మీరు? విషింగ్ యూ ఏ వెరీ హ్యాపీ డే 🤝🤝.... ఈరోజు మీ నేస్తం ఇంకో కొత్త అంశం తీసుకొచ్చింది..... మనం పూర్తిగా నిద్రలో ఉన్నప్పుడు అసలు మన శరీరంలో ఏం జరుగుతుంది? దీని గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఫ్రెండ్స్...... నిద్రలో మన శరీరం అనేక అల్లరి పనులు చేస్తుంది. మనం నిద్రలో ఉన్నప్పుడు అనేకసార్లు అంటే ప్రతి వ్యక్తి కూడా నిద్రలో 20 నుండి 40 సార్లు పక్కలకు తిరుగుతాడు.నిద్రలో రక్తప్రసరణ మామూలుగానే జరుగుతుంది. గుండె కొట్టుకునే వేగం కొంచెం తగ్గుతుంది.జీర్ణాశయంలో పనులు తేడా లేకుండా జరుగుతూనే ఉంటాయి. కాలేయము,మూత్రపిండాలు తమ విధిని నిర్వర్తిస్తూనే ఉంటాయి. నిద్రావస్థలో ధ్వని,వెళుతురు,వేడి,వాసన మొదలగునవి....ప్రతిక్రియలన్నీ మామూలుగానే ఉంటాయి.నిద్రలో మన శరీర ఉష్ణోగ్రత సుమారు ఒక డిగ్రీ వరకు తగ్గుతుంది. నిద్రపోయేటప్పుడు పగలంతా కూడపెట్టిన వ్యర్థ పదార్థాలను వదిలించుకోవడంలో శరీరంలో ఉన్న అన్ని కణాలు నిమగ్నమై ఉంటాయి. నిద్ర పరిమాణం ఆయా వ్యక్తులను బట్టి ఉంటుంది.వయస్సులో ఉన్న వ్యక్తి సగటు 7 నుండి 9 గంటలు 15 ఏళ్ల వయసు గల బాలబాలికలకు 10గంటల నిద్ర అవసరం...ప్రతిరోజు రాత్రి ఒకవేళ అలవాటు చేసుకోవడం మంచిది... ఇది ఫ్రెండ్స్ జరుగుతున్నది..... మళ్లీ ఇంకో కొత్త విషయంతో త్వరలోనే కలుద్దామా ఫ్రెండ్స్..... నేను.. మీ నేస్తం ఎల్లప్పుడూ ఇటువంటి కొత్త విషయాలను మీ ముందుకు తెస్తూనే ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్! త్వరలోనే మీ ముందు ఉంటా.....
కామెంట్‌లు