రంగురంగుల చిలకమ్మా
ఎన్ని రంగులు నీకమ్మ
రంగు రంగుల చొక్కలతో
రెక్కలు విప్పి లేస్తావు!!
పూల మీద వాలుతావు
పసిడి రంగుల చిలకమ్మా
పదిలంగా నీవు రావమ్మా
రంగుల చొక్కా తేవమ్మా!!
ఎర్ర రంగు చొక్కతో
ఎగురు కుంటు రావమ్మా
నల్ల రంగు చొక్కను
మెల్లిగా నీవు తేవమ్మా !!
సీత మెచ్చిన చిలకమ్మా
చిత్రమైన చిలకమ్మా
నీ పేరు నేను చెప్పనా
సీతకోక చిలకవు నీవమ్మా !!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి