మన్ అని హిందీలో అర్థం మనస్సు.కానీఅప్రత్యక్ష ద్రవ్యం గా సంఖ్య పరిమాణం సంయోగ విభాగ పరత్వ సంస్కారం దీని ప్రముఖ గుణాలు అని చెప్పబడింది.అణురూపంలో ఉంది.మహాభారతం ప్రకారం మనస్ కి 9గుణాలున్నాయి.ధైర్యం ఊహాపోహ భ్రాంతి కల్పన వైరాగ్యం రాగద్వేషాలు క్షమ స్మరణ చంచలత.మనసు పెట్టి చేసే సేవను మానసీ మనజాసేవ అంటారు
మనసు మస్తిష్కం తేడా లో స్పష్టత లేదు.మనోవిజ్ఞానం శరీరవిగ్నానం దృష్టి లోమనిషిశరీరంలో ఏ అంగం పేరు కూడా మన్ అని లేదు.చేతన ఆలోచన ఇచ్ఛభావన కి జనకుడు మనసు.ఆంగ్లంలో మైండ్ అంటారు.శాంతిపర్వంలో ఇలా ఉంది.. ఇంద్రియాలనుంచి సూక్ష్మ చిత్తం చిత్తం నుంచి సూక్ష్మ మనసు అందులో నించి బుద్ధి బుద్ధి నుంచి సూక్ష్మ ఆత్మ ఒకదాని కొకటి అనుసంధానం గావింపబడినాయి.పతంజలి అనుసారం చిత్తం అంటే మనసు.యోగాశ్చిత్త వృత్తి నిరోధః వేదాంతం ప్రకారం సంకల్పం వికల్పం అంటే మనసు చేసేపని.మనం తేలిగ్గా అర్థం కావడం కోసం మనసు అంటాం 🌺
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి