సగం వాడిన గరికకు
జీవం పోసినట్టు
సాలీడు కట్టిన ఇంటికి
పుత్తడి వెల్ల వేసినట్టూ
ఆకుల పరదాలు
ఆపుతున్నా ఆలకించక
అవని అణువణువూ
ఆవరించినట్టూ...
పిచ్చిమొక్కలకు
ప్రాణంపోస్తూ....
గడ్డి పువ్వులను
ప్రేమగా పలకరిస్తున్నట్టూ...
పల్లె తల్లిని మెల్లగ
మేల్కొలుపుతున్నట్టూ
పాలపిట్టల పాటకు
చేలు ఊగినట్టూ....
ఆకుల చప్పట్లు
గలగలమంటుంటే
సోకులన్నీ చూసుకుని
నేల మురిసినట్టూ....
పొద్దుపొద్దున ముద్దుల
ముంచెత్తినెట్టూ..
సుద్దులెన్నో గుసగుసగ
పంచుకున్నట్టూ....
కురిసి పరచుకున్న
సిరివెలుగు రేఖల
విరిసిన వసుమతి శోభల
వర్ణించ తరమా?
పల్లెపదం లాటి హాయైన
వేకువకు
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి