పూలసందేశం;- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
పూలతోసందేశమును
పంపనా
పూబోడులమదులను
దోచనా

తలలోపూలు
తురుమనా
తనువునుతాకి
తరించనా

చేతికిపూలు
ఇవ్వనా
మదిలోప్రేమను
చాటనా

చెవిలోపూలు
పెట్టనా
వెర్రిదానిని
చెయ్యనా

ముక్కుకుమల్లెలు
తగిలించనా
మంచిగంధమును
పీల్పించనా

చీరకుపూలు
అంటించనా
అందాలను
రెట్టింపుచేయనా

మాలగామల్లెలు
అల్లనా
మెడలోదండను
వేయనా

పడకపైపువ్వులు
చల్లనా
పవళించుటకు
పిలువనా

కంటికిపూలు
అద్దనా
చల్లదనమును
కలిగించనా

బుగ్గకుపూలు
రాయనా
కోమలము
చెయ్యనా

తాజామల్లెలు
తీసుకురానా
తట్టినకోర్కెలు
తెలుపనా

పూలతో
మాట్లాడించనా
ప్రణయంలో
దించేయనా

పూలకవితలు
వ్రాయనా
పాఠకులమనసులు
పులకించనా

కాళిదాసుని మేఘసందేశం
శ్రీనాధుని హంసరాయబారం
ప్రసాదుని పూలప్రస్తావితం
పోల్చుకొని పాడండిప్రణయగీతం


కామెంట్‌లు