ఓ అన్నా! రావా నీ కై
రాఖీ చేతపట్టి పండుగ కదా
కూర్చున్నా,కాలం పరిగెత్తు తోంది
ఆనందంగా కానీ నామనసే ఎదురు
చూస్తోంది నీకై, రాకూడదా
నాచేత రాఖీ కట్టించు కోవా
ఏందన్నా, అందరం హాయిగా
ఉందామన్నావు,చెప్పకనే
నన్ను చిరు చీకటి దుప్పటి కప్పి
నిదుర పుచ్చిపోయినావు
ఈ రాఖీ నీ కెలా చేర్చను
న్యాయమా అన్నా ! ఆ నాడు
అమ్మవయ్యావు ఆదరించావు
నిదురపుచ్చావు ఆటలాడేవు
ఈ కీ నీడ బతుకు ఎలా అన్నా
కనీసం కలలోనైనా నన్ను పలకరించవా
కరుణతో దీవించవా ప్రేమతో
మర్చిపోకన్న నీ మమతల
మనసు నా కనుల వెలుగు
ఎందుకు ఈ దీర్ఘ మౌనం
ఈ శూన్యం నింపలేక
హృది నలుగుతోంది ఓ అన్నా
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి