మనసును తొలిచే
ఏ కలతైనా....
మాయమవును
తమ రాక తోనే!!
గుండె లోతుల దాగిన
ఏ కొదవైనా
గురుతురాదు ఈ దృశ్యం
చూస్తే!
కనులకింపైన పచ్చదనం
అది వనమైనా
భయమనిపించదు
తొలి వెలుగుల శోభలో!
కోనల నడుమ నీటి ధారల
సవ్వడైనా...
సరిగమలే వేకువ ఝామున!
గువ్వల మందల
కువకువలైనా పసిపాదాల
సిరి సిరి మువ్వలే
తెల్లారి వెలుగులో!
చురుకుమని స్పృశించే
వెచ్చని కిరణాలు
కన్నతండ్రి పరిష్వంగాలే
అరుణోదయ వేళలో!
కనులముందు వెలుగుల తేట
మోయలేని పసిడి మూట
వర్ణింప నా నోట
సరిపోలని తెలుగుమాట.
ఆనందాల వెలుగులు తెచ్చే
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి