కొండమల్లెపూలతో
కోనంతా నిండుగా
కొనితెచ్చెనంట పండుగ
కొండల నడుమ పుట్టిన
కోటి వెలుగుల దీపం
నిన్నటి కలతలు మాపి
రేపటి కలల తీపి
ఈనాడే పంచివ్వగా
ఉదయించెను తూరుపున
గతమంతా మరపించగ
చెలిమితో చేరువ చేసి
వెలుగుల తీరం
కరువులన్నీ తీరాలని
కమ్మటి క్షణాలు కానుకగా
కలిమిలా ఇవ్వాలని..
వేదనలు వెలికి పంపి
వేడుకగా మనసు నిండి
రెప్పదాచిన స్వప్నాల
కుప్పగా ముంగిటపోసి
మురిపాల తేలించాలని....
కనుచూపులు పరచుకుని
పెనుకోరిక పెంచుకుని
మునివేళ్ళపై నిలబడి
ఎదురుచూచు పువ్వులకు
నవ్వులద్దాలని....
ఆగమించు ఆప్తమిత్రుని
ఆశతీర స్వాగతించి
ఆప్యాయంగా కౌగలించి
ఆత్మీయపు స్పర్శతో
పులకరిస్తూ పుడమి పాడే
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి