ఆర్తి (చిట్టి వ్యాసం);- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 సదాశివా! తాపసీ! కైలాసవాసీ! ఎక్కడున్నావు తండ్రీ! ఎక్కడని నీకోసం వెదకను? నీవులేక నేనెలా మనగలను? నీమార్గంలోనే నే పయనిస్తున్నా అడుగడుగునా నాకు అనిపిస్తోంది ఇది ముళ్ళునిండిన దారిలా. అయినా సరే! నేనెవరిమాటా వినను. నీవు చెప్పినట్టే నడుస్తా. అయినా నేనేం చేయనయ్యా?!  నా విశ్వాసం అంత బలంగా లేదు. నా మనసంతా చీకటే. నాకులాగే ప్రపంచమంతా ఏడుస్తోంది. వారి బాధలకు నేను హృదయపూర్వకంగా నిన్ను పిలుస్తున్నా సదాశివా! కైలాసవాసీ! నిన్నుగానక నేనెక్కడికీ పోను ప్రభూ! నీవులేక నేను సంపూర్ణమెలా అవుతాను? ఉన్నావు... నిజంగానే ఉన్నావు… అని అంతా అంటున్నారు కదా! మరి రావేం? కనబడవేం? నీ మహిమ చూపవేం? నా ఆర్తి తీర్చవేం?!!!
+++++++++++++++++++++++++

కామెంట్‌లు
visalakshi చెప్పారు…
ఆర్తితోడపిలుపుఆదిదేవుడువిన్న పరుగపెట్టివచ్చివరములిచ్చి కన్నతండ్రిగానకావగవచ్చును. @ చింతవీడుమయ్యవంతువచ్చు
visalakshi చెప్పారు…
ఆర్తితోడపిలుపుఆదిదేవుడువిన్న పరుగపెట్టివచ్చివరములిచ్చి కన్నతండ్రిగానకావగవచ్చును. @ చింతవీడుమయ్యవంతువచ్చు