ప్రభుత్వ పాఠశాలల్లోనే శిక్షణ పొందిన అర్హత గల ఉపాధ్యాయులు బోధిస్తున్నారని, బడీడు కలిగిన పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదవాలని శ్రీరాంపూర్ ఏఎస్ఐ బండ రఘు కోరారు. మంగళవారం ఆయన మండల కేంద్రంలోని మండల పరిషత్ ఆంగ్ల మాధ్యమ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. అక్కడ జరుగుతున్న తెలుగు భాషా దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏ ఎస్ఐ మాట్లాడుతూ... ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యతోపాటు సకల సౌకర్యాలు కల్పిస్తున్నారని, తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలన్నారు. తాను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివి పోలీసు ఉద్యోగం సంపాదించాలని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఆయన పిల్లల్ని ప్రశ్నిస్తూ భవిష్యత్తులో మీరు ఏమవుతారని అడగగా, పోలీస్ ఆఫీసర్ అవుతామని చేతులెత్తారు. పిల్లలు కష్టపడి చదువుతేనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని చెబుతూ వారికి పలు సూచనలు, సలహాలిచ్చారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య మాట్లాడుతూ... తెలుగు భాషా దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు. ప్రతి ఒక్కరూ తెలుగు భాష సంరక్షణ కోసం కృషి చేయాలని కోరారు. తెలుగు భాష అభివృద్ధిని కాంక్షించి, తాను 'మధురిమలు' అనే నూతన తెలుగు లఘు కవితా ప్రక్రియ ప్రారంభించి వందలాదిమంది కవులు, కవయిత్రుల చేత రచనలు చేయిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆన్లైన్ ద్వారా పురస్కార పత్రాలను అందజేస్తూ అనేక మంది కవులను ప్రోత్సహిస్తున్నట్లు ఈర్ల సమ్మయ్య తెలియజేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు ఈర్లసమ్మయ్య, టీచర్లు పాఠశాల పిల్లల చేత ప్రాచీన కవులు, కవయిత్రులు నన్నయ, తిక్కన, ఎర్ర ప్రగడ, వేమన, మొల్ల, అక్కమాంబ, కుప్పాంబిక వంటి వారి వేషధారణలు వేయించి అందరినీ ఆకర్షింపచేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ బండ రఘు, ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య, పాఠశాల టీచర్లు విజయలక్ష్మి, సమత, భారతి, పిల్లల తల్లిదండ్రులు, విద్యార్థినీ, విద్యార్థులు, పలువురు పాల్గొన్నారు.
పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదవాలి'; - ఏఎస్ఐ బండ రఘు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి