పట్టు పట్టరాదు పట్టి విడువరాదు
పట్టెనేని బిగియ పట్టవలయు
పట్టువిడుచుట కన్న పడిచచ్చుటే మేలు
విశ్వదాభిరామ వినురవేమ
ఒకసారి పనిని ప్రారంభించాక మధ్యలో వదలిపెట్టరాదు. లక్ష్యసిద్ధే కొనదాకా వూపిరిగా నిలవాలి. 'పట్టిన పట్టును విడుచుటకన్న పడిచచ్చుటమేలు' అంటూ వేమన కార్యసాధకుడికి వుండాల్సిన పట్టుదలను నొక్కి వేమన అద్భుతంగా వక్కాణించాడు.
కృషికి… పట్టుదల తోడైతే విజయం మనసొంతం అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కలలు కనడంలో తప్పులేదు. అది సాధించుకోవడంలోనే గొప్పతనం ఉంటుంది. సాధారణ కుటుంబంలో జన్మించినా, చిన్నతనం నుండే ఉన్నత భావాలతో లక్ష్యాలను నిర్దేశించుకొని పట్టుదలతో అత్యంత గౌరవ ప్రదమైన స్థానాన్ని దక్కించుకున్న ఎందరో మనకు చరిత్రలో కనబడతారు.
నిరుపేద కుటుంబాలు. రెక్కాడితేగానీ డొక్కాడని బతుకులు. బాల్యం నుంచే అమ్మానాన్నల కష్టాన్ని కండ్లారా చూసి పెరిగిన పిల్లలు ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని సంకల్పించారు. చదువే లోకంగా కష్టపడి ఎస్‌ఐ కొలువులు కొల్లగొట్టారు. ఒకరు కాదు ఇద్దరు కాదు కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు చెందిన ఏడుగురు పేదింటి విద్యా కుసుమాలు తాజాగా విడుదలైన ఎస్‌ఐ ఫలితాల్లో సత్తాచాటి, కుటుంబాల్లో ఆనందాన్ని నింపారు.
పట్టుదల ఉంటే సాధించలేనిదేమీ లేదని నిరూపించారు ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లా యువతీ యువకులు . ఇటువంటి ఉదాహరణలు మనకు ఎన్నో కనిపిస్తాయి. కాబట్టి పట్టుదల అనే సద్గుణాన్ని మనం పెంపొందించుకోవాలి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి