గుహలు ఎలా ఏర్పడుతాయి?;- ఎస్.మౌనిక

  హాయ్! హలో మై డియర్ ఫ్రెండ్స్....ఎలా ఉన్నారు? నేనైతే ఫుల్ హ్యాపీ.... మరి మీరు? విష్ యూ ఏ వెరీ హ్యాపీ డే! ఈరోజు ఇంకో కొత్త అంశంతో మీ నేస్తం వచ్చేసింది..... భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచిన అజంతా మరియు ఎల్లోరా గుహలకు మీరు ఎప్పుడైనా వెళ్లారా?మరి గుహలు ఎలా ఏర్పడతాయి అన్నది మీకు తెలుసా?రండి అయితే తెలుసుకుందాం..... గుహ అంటే పర్వతముల మధ్యన ఉండే కాళీ ప్రదేశం.ఇది అనేక విధాలుగా ఏర్పడుతుంది. సముద్రం కెరటాలు పర్వతానికి తాకుతూ కొండరాళ్ళ మధ్య ఉండే చిన్న చిన్న రాళ్ళను తొలగిస్తాయి.ఈ క్రియ ఇలా అనేక వేల సంవత్సరాలు జరిగితే పర్వతంలో విశాలమైన ఖాళీ ప్రదేశం ఏర్పడుతుంది.దీనినే మనం గుహ అంటాము. కొన్ని గుహలు భూమి లోపల కూడా కనబడతాయి.ఇవి భూమి లోపల ఉండే నీటి ప్రవాహాల వలన ఏర్పడి ఉండవచ్చు. భూగర్భ నీటి ప్రవాహాలలో సున్నపురాలు కొట్టుకుపోయి ఉండవచ్చు.అలా ఏర్పడిన ఖాళీలే ఈ గుహలు.తరచూ జలపాతాలు కూడా పర్వతాల మధ్యలో ఖాళీ స్థలాలను ఏర్పరుస్తాయి. అవి చివరకు గుహలుగా మార్పు చెందుతాయి.నయాగారా జలపాతాల కింది గుహలు ఈ విధంగానే ఏర్పడ్డాయట.... భూమి పొరల మధ్య అగ్నిపర్వతాలలో వచ్చే మార్పుల వలన కూడా ఈ గుహలు ఏర్పడతాయట..... కొత్తగా ఉంది కదా ఫ్రెండ్స్! మనం మళ్లీ త్వరలోనే ఇంకో కొత్త విషయంతో కలుద్దామా ఫ్రెండ్స్! కొత్త విషయంతో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్...!బాయ్ ఫ్రెండ్స్!👋
కామెంట్‌లు